Raghava Lawrence First Look Released from Chandramukhi 2 Movie and Movie releasing on Vinayaka Chavithi
Chandramukhi 2 Movie : 2005లో రజినీకాంత్(Rajinikanth) హీరోగా జ్యోతిక(Jyothika) మెయిన్ లీడ్ లో వచ్చిన చంద్రముఖి(Chandramukhi) సినిమా ప్రేక్షకులని నవ్వించి, భయపెట్టి భారీ విజయం సాధించింది. మళ్ళీ ఇన్నాళ్లకు 18 ఏళ్ళ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. కొన్ని నెలల క్రితం చంద్రముఖి 2 తీస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రముఖి(Chandramukhi) తీసిన దర్శకుడు వాసునే(Vasu) మళ్ళీ ఇప్పుడు చంద్రముఖి సీక్వెల్ తీస్తున్నాడు.
అయితే ఈ సారి రాఘవ లారెన్స్(Raghava Lawrence) హీరోగా, కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన చంద్రముఖి 2 సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. వెట్టియన్ రాజాగా లారెన్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.
Megastar Chiranjeevi : 67 వయసులో.. మెగాస్టార్ మెగా స్టైలిష్ లుక్స్..
ఇక చంద్రముఖి 2 సినిమాను వినాయకచవితికి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. చంద్రముఖి 2 సినిమాని ఈ సారి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సరి చంద్రముఖి 2 ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో చూడాలి.
Back with double the swag and attitude! ? Witness Vettaiyan Raja's ? intimidating presence in @offl_Lawrence 's powerful first look from Chandramukhi-2 ?️
Releasing this GANESH CHATURTHI in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada! ?#Chandramukhi2 ?️
? #PVasu
?… pic.twitter.com/nf7BHwi3x6— Lyca Productions (@LycaProductions) July 31, 2023