Raga Kunche: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రఘు కుంచె కూతురు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన రాగా కుంచె

తాతైన ప్రముఖ సింగర్, సంగీత దర్శకుడు రఘు కుంచె. ఆయన కూతురు రాగా కుంచె(Raga Kunche) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

Raghu Kunche daughter raga kunche gives birth to a healthy baby boy

ప్రముఖ సింగర్, సంగీత దర్శకుడు రఘు కుంచె ఇంట్లో సంబరాలు నెలకొన్నాయి. ఆయన తాత అయ్యారు. రఘు కుంచె కుమార్తె రాగా కుంచె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రాగా సోషల్ మీడియా వేదికగా ఎంతో భావోద్వేగంగా పంచుకున్నారు. “మా ప్రపంచం నీలిరంగులోకి మారిపోయింది.. మా బుజ్జి బాబు వచ్చేశాడు” అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Trisha Political Entry: పదేళ్లలో సీఎం అవుతా.. చెప్పి మరీ కొట్టారుగా.. వైరల్ అవుతున్న త్రిష షాకింగ్ వీడియో

తన గర్భధారణ సమయం నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ, దేవుడు తన ప్రార్థనలు ఆలకించాడని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుండగా, నెటిజన్లు, సినీ ప్రముఖులు రఘు కుంచె కుటుంబానికి అభినందనలు తెలుపుతున్నారు.