నటికి డ్రగ్స్ రాకెట్‌తో లింకు.. విచారణకు హాజరవుతానంటూ పోస్ట్..

  • Publish Date - September 3, 2020 / 04:45 PM IST

Ragini Dwivedi on Sandalwood drug racket: క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో కలకలం రేపిన డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులు న‌టి రాగిణి ద్వివేదికి స‌మ‌న్లు జారీ చేశారు. నేడు (సెప్టెంబర్ 3) రాత్రిలోగా సీసీబీ ఎదుట హాజరు కావాల‌ని ఆదేశించారు. కాగా ఈ కేసులో న‌టి స్నేహితుడు ర‌విని పోలీసులు ఇదివ‌ర‌కే అరెస్ట్ చేశారు.



ద‌ర్యాప్తులో న‌టి రాగిణికి కూడా డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంతో సంబంధాలున్న‌ట్లుగా సంకేతాలు అంద‌డంతో ఆమెను విచార‌ణ‌కు ఆదేశించారు. దీని గురించి మ‌రిన్ని వివ‌రాలు రాబ‌ట్టేందుకు ఆమెపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించ‌నున్నారు. అయితే గురువారం రాగిణి విచారణకు హాజరు కాలేదు.. ఆమె రాలేకపోవడానికి గల కారణాలను ఆమె తరపు న్యాయవాది సీసీబీ పోలీసులకు వివరించారు.

తాజాగా తాను సోమవారం (సెప్టెంబర్ 7) విచారణకు హాజరవుతానని రాగిణి పోస్ట్ చేశారు. సీసీబీ పోలీసులనుంచి సమన్లు వచ్చాయి. ఈరోజు విచారణకు హాజరుకావడం కుదర్లేదు. సోమవారం ఉదయం విచారణకు హాజరుకాబోతున్నాను. నాకు చట్టవ్యతిరేకమైన ఎటువంటి వ్యవహారాలతో సంబంధం లేదు. సీసీబీ పోలీసులకు విచారణలో పూర్తిగా సహకరిస్తాను అని తెలిపారు రాగిణి ద్వివేది.



కాగా క‌న్న‌డ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో న‌టీన‌టుల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న ముఠాను ఆగ‌స్టు 20న ఎన్సీబీ(నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒక‌రి డైరీని స్వాధీనం చేసుకోగా అందులో సెల‌బ్రిటీలు, న‌టులు, మోడ‌ల్స్ పేర్లు ఉన్నాయి.