Raha Birthday : రాహా పుట్టినరోజు స్పెషల్.. ఆలియా ఎమోషనల్ పోస్ట్ వైరల్..

Raha birthday special Alia emotional post viral

Raha Birthday : బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా, రణబీర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు ఈ కపుల్. కేవలం హిందీలోనే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాలు చేసారు. ఇక ఈ దంపతులకి రాహా అనే కూతురు కూడా ఉంది. తనకి సంబందించిన ఫోటోలు నిరంతరం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

Also Read : Sai Pallavi : అమరన్ సక్సెస్ మీట్ లో సాయి పల్లవి.. చీరలో ఎంత క్యూట్ గా ఉందో..

అయితే నేటికి రణబీర్, అలియా దంపతులకి రాహా పుట్టి రెండు సంవత్సరాలు. ఇక ఈ సందర్బంగా.. అలియా తన సోషల్ మీడియా వేదికగా తన కూతురి ఫోటో షేర్ చేస్తూ.. ఈ రోజుకి నువ్వు పుట్టి రెండు సంవత్సరాలు.. నీకు కొన్ని వారాల వయస్సు ఉన్న సమయానికి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాను. ఎవ్వరైనా ఒక్కసారి పేరెంట్స్ అయితే వాళ్ళు ఎప్పటికీ తమ బిడ్డతోనే ఉండాలని అనుకుంటారు. నా జీవితం అయిన నీకు.. హ్యాపీ బర్త్ డే. నువ్వు వచ్చిన తర్వాత నుండి మా ప్రతి రోజు కప్ కేక్ లా మారిందని పేర్కొంది.


ఇక అలియా, రణబీర్ కొన్ని సంవత్సరాలు ప్రేమలో ఉండి ఏప్రిల్ 2022లో వివాహం చేసుకున్నారు. అనంతరం 2022 నవంబర్ లో రాహా కి జన్మనిచ్చారు.