Nani-Srikanth Odela : దసరా డైరెక్టర్ తో ప్యారడైజ్ మొదలుపెట్టిన నాని..

Nani started Paradise with Dussehra director
Nani-Srikanth Odela : ప్రస్తుతం వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంటున్నాడు నాని. దసరా, హాయ్ నాన్న, ఇటీవల సరిపోదా శనివారం వంటి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాడు. ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా సినిమా నానికి ఎంతటి ఎనర్జీ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దసరా సినిమా సక్సెస్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read : Sai Pallavi : అమరన్ సక్సెస్ మీట్ లో సాయి పల్లవి.. చీరలో ఎంత క్యూట్ గా ఉందో..
తాజాగా వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ ను ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. ” ప్యారడైజ్ ” అనే టైటిల్ తో నాని, శ్రీకాంత్ సినిమా తెరకెక్కబోతుంది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ నాని తన సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టర్ విడుదల చేశారు. భారీ కమర్షియల్ హిట్‌ను కొట్టాలని ఈ సినిమాకి ఇలాంటి ఒక స్ట్రాంగ్ టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది.
YES.#THEPARADISE
A Srikanth Odela Film. pic.twitter.com/wnBPrVrlMG— Nani (@NameisNani) November 6, 2024
ఇక పోస్టర్ గమనిస్తే.. టైటిల్ అక్షరాల్లో కింద ఎక్కువ మొత్తంలో గన్నులు కనిపిస్తున్నాయి. అలాగే టైటిల్ సైతం ఎరుపు రంగులో ఉంది. ఇదంతా చూస్తుంటే నాని కోసం శ్రీకాంత్ ఓదెల పెద్ద ప్లాన్ ఏ వేసినట్టు కనిపిస్తున్నాడు.