33 ఏళ్ల నటితో 51 ఏళ్ల విలన్ డేటింగ్

  • Publish Date - March 9, 2020 / 02:32 AM IST

రాహుల్ దేవ్ ….బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా పలు దక్షిణాది భాషా చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించిన నటుడు. తెలుగులో దాదాపు అందరు హీరోల సినిమాల్లోనూ విలన్ గా నటించారు.  ఇప్పుడు ఈవిలన్ వయస్సులో తన కంటే 18 ఏళ్లు చిన్నదైన 33 ఏళ్ల నటి, మోడల్ ముగ్దా గాడ్సేతో ల డేటింగ్ లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే గతంలో మీడియాకు చెప్పారు.  రెండు వైపులా కుటుంబ సభ్యులకు  తమ ప్రేమ సమ్మతమేనని ఆయన చెప్పారు.(బాయ్‌ఫ్రెండ్‌తో ఉండగా తల్లి వచ్చింది..ఆ తర్వాత బాలిక ఏం చేసింది)

రాహుల్  1998 లో తన చిన్ననాటి స్నేహితురాలైన  రైనాను 1998 లో పెళ్ళి  చేసుకున్నారు. వీరికి సిద్ధార్ధ్ పుట్టాడు.  కొడుకు పుట్టిన 11 ఏళ్ళ వయస్సులో రైనాకు క్యాన్సర్ ఉందని తేలింది. భార్య రైనా 2009లో క్యాన్సర్ తో చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత కెరీర్,  కుమారుడు మీద  దృష్టి పెట్టిన రాహుల్ కు ఒక స్నేహితుడి పెళ్లిలో ముగ్ద పరిచయం అయ్యింది.  వీరిద్దిరి మధ్య వయస్సు తేడా 18 ఏళ్లు ఉంది. ఈవయస్సుతేడానే ఇప్పుడు సోషల్ మీడియాలో  హాటా టాపిక్  గా మారింది. నెటిజన్లు వయస్సు తేడాపై  ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో రాహుల్ స్పందించారు.

మా ఇద్దరిమధ్య వయస్సుతేడా పెద్ద సమస్యకాదు. మొదట మేమిద్దరం మంచి స్నేహితులం  ఆ తర్వాత మా ఇద్దరిమధ్య ఇష్టం పుట్టింది.  మా ప్రేమ విషయం రెండు కుటంబాలకు తెలుసు , నా కుమారుడికి  సమ్మతమే.. మా ఇంట్లో మా నాన్నకంటే మా అమ్మ పదేళ్లు చిన్నది…సో  నా విషయంలో 18 ఏళ్ల ఏజ్ గ్యాప్ పెద్ద సమస్య కాదని పిస్తోందన్నారు. మనం సంతోషంగా ఉంటే  వయసు తేడా మిగిలినవి సమస్యే కాదని  రాహుల్ దేవ్ చెప్పుకొచ్చారు.