బిగ్‌బాస్ షో గురువారం (ఆగస్ట్ 22, 2019) ఎపిసోడ్ గొడవలు, అరుచుకోవడాలతో గడిచింది. అలీ – మహేష్ విట్టా, శ్రీముఖి – రాహుల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇంతకు వారి మధ్య గొడవ ఏంటి? అసలు ఆ గొడవ ఎక్కడకు దారి తీసిందో చూద్దాం.
కొద్దికాలంగా ఇంటి సభ్యుల మధ్య వచ్చే సమస్యలకు ఫుల్ స్టాప్ పెడదామని బిగ్‌బాస్ ప్రయత్నం చేశారు. దీంతో బిగ్ బాస్ ఇంటి సభ్యులను ఒక లేఖలో ఎవరి వల్ల సమస్యగా ఫీల్ అవుతున్నారో రాసి బాక్స్ లో వేయమన్నారు. బిగ్ బాస్ చెప్పిన విధంగానే ఇంటి సభ్యులు లేఖ రాసి బాక్స్ లో వేశారు. ఆ బాక్స్ ను తీసుకొచ్చిన కెప్టెన్ శివజ్యోతి హాల్ లో అందరి ముందు ఒక్కో లెటర్ చదివి వినిపించింది.
అయితే ముందుగా మహేష్ పై వచ్చిన కంప్లైంట్ ని శివజ్యోతి చదివి వినిపించింది. ‘అవసరంలేని విషయాలలో దూరి అనవసరపు సలహాలు ఇస్తాడని’ అందులో రాసి ఉంది. ఇది ఎవరు రాసి ఉంటారో గెస్ చేయమని శివజ్యోతి మహేష్ ని అడగగా ‘అది ఎవరు రాశారో వాళ్ళనే చెప్పమను’ అని అన్నాడు. దీంతో ‘అది రాసింది నేనే అంటూ పునర్నవి మహేష్ తప్పులని ఎత్తి చూపించింది. నువ్వు బాబా భాస్కర్‌తో తప్ప ఎవరితో కలవవు. అనవసరంగా వేరే విషయాలలో దూరి సలహాలు ఇస్తావు. ఇది ఇంకోసారి చేయకు’ అని గట్టిగా అరిచి చెప్పింది.
తర్వాత శివజ్యోతి అలీ పై మహేష్ రాసిన కంప్లైంట్ ని చదివి వినిపించింది. ‘హౌస్‌మేట్స్‌ని తక్కువ చేసి మాట్లాడటం.. ఎదుటి మనిషికి మర్యాద ఇవ్వకపోవడం.. హీరో అవ్వడానికి బిగ్ బాస్ నియమాలు తప్పడం’ అని రాశాడు. దీనిపై అలీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘నేను ఎవరిని తక్కువ చేయలేదు. నీకు అలా అనిపించి ఉంటుంది’ అన్నాడు. దీంతో మహేశ్.. అలీ తప్పులని ఎత్తి చూపుతుండగా, అలీ ఫుల్ ఫైర్ అయ్యాడు.
‘ఇదేమన్నా నీ ఇల్లు అనుకుంటున్నావా.. ఎందుకు అలా అరుస్తున్నావ్’ అని మహేష్ కూడా మిస్ ఫైర్ అయ్యాడు. ఇక ఇద్దరి మధ్య గొడవ ఓ రేంజ్‌లో జరిగింది. ఇక మహేష్, అలీ తర్వాత శ్రీముఖికి పై రాహుల్ రాసిన కంప్లైంట్ ను శివజ్యోతి చదివి వినిపించగా.. శ్రీముఖి వెంటనే లేచి రాహుల్ కి హగ్ ఇచ్చి.. ‘చోడ్ దో యార్ అని సర్ది చెప్పుకుంది. అంతలోనే రాహుల్ లేచి మళ్ళీ పాత స్టోరీ అంతా వివరించగా.. ‘శ్రీముఖికి మళ్లీ కోపం వచ్చింది. అన్నీ మరిచిపోయి మంచిగా ఉందామని ప్రయత్నిస్తున్నా. అతనే ఇంకా ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నాడు’అని శ్రీముఖి తెలిపింది.
చివరిగా ఎక్కువ కంప్లైంట్స్ మహేష్, రాహుల్‌పై రావడంతో ఇద్దరిని జైలులో వేసి తాళం వేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో 33వ ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో హిమజ రచ్చ చేయబోతుంది. తను ఆమ్లెట్ తింటన్న టైంలో ఎవరో కమెంట్ చేశారని తినే ప్లేట్ విసిరేసి… మిగతా గుడ్లు కూడా పగలగొట్టేస్తుంది. ఇందుకు కారణం ఏంటో ఈ రోజు ఎపిసోడ్ లో చూసేద్దాం.