×
Ad

Rahul Sipligunj : బిగ్‌బాస్ ‘రతిక’తో రిలేషన్ గురించి రాహుల్ సిప్లిగంజ్ పోస్టు..

బిగ్‌బాస్ హౌస్ లోకి వెళ్లిన 'రతిక'.. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో బ్రేకప్ చేసుకుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీని పై..

  • Published On : September 21, 2023 / 11:10 AM IST

Rahul Sipligunj post on break up with BiggBoss fame Rathika Rose

Rahul Sipligunj : బిగ్‌బాస్ సీజన్ 7 మొదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ ని నాగార్జున ఉల్టా పల్టా అంటూ నాగార్జున చాలా ఇంటరెస్టింగా ముందుకు తీసుకు వెళ్తున్నాడు. ఈ సీజన్ లో ఆల్మోస్ట్ ఆడియన్స్ కి తెలిసిన కంటెస్టెంట్స్ రావడంతో ప్రేక్షకులు కూడా బిగ్‌బాస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ వస్తున్నారు. ఇక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో ‘రతిక రోజ్’ (Rathika Rose) సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. తన గేమ్ ప్లాన్ తో హౌస్ లోని మెంబెర్స్ లో ఎక్కువ హైలైట్ అవుతూ వస్తుంది.

Cool Suresh : లేడీ యాంకర్‌తో తమిళ నటుడు తప్పు ప్రవర్తన.. భార్య అభ్యంతరంతో క్షమాపణలు..

ఇక ఈ సీజన్ స్టార్టింగ్ సమయంలోనే రతిక లవ్ స్టోరీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. నాటు నాటు పాటతో ఆస్కార్ స్టేజి వరకు వెళ్లిన రాహుల్ సిప్లిగంజ్ తో రతిక రోజ్ ప్రేమలో పడిందని, అయితే ఇప్పుడు బ్రేకప్ అయ్యిందని, అందుకు సంబంధించిన కొన్ని పర్సనల్ ఫోటోలు కూడా నెట్టింట హల్ చల్ చేశాయి. ఇక ఈ లవ్ స్టోరీ గురించి కూడా రతిక.. హౌస్ లో ఇన్‌డైరెక్ట్ మాట్లాడడం వంటివి జరిగిని. కాగా ఈ విషయం పై రాహుల్ ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు. తాజాగా నేడు తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టాడు.

Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ నుంచి హీరోయిన్ అవుట్.. రీజన్ ఏంటి..?

“ఒక మనిషికి తెలియకుండా తమ ఫోన్ నుంచి తమ పర్సనల్ ఫోటోలు ఆరేళ్ళ తరువాత ఎలా బయటకి వస్తాయి. అది కూడా లోపలకి వెళ్ళడానికి ముందు. ఇదంతా ఒక ప్రీ ప్లాన్. ఏ అమ్మాయి లేదా అబ్బాయి విషయంలో నేను స్పందించాల్సిన అవసరం లేదు. సక్సెస్ అవ్వడానికి ఎవరికి వారు కష్టపడుతుంటారు. అయితే వారు ఒక పని చేసేటప్పుడు ఎదుటివారికి కుటుంబం ఉంటుంది. మీ పని వల్ల వారి ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడతారో అనేది మీరే ఆలోచించండి. ప్రతి ఒక్కరికి గతం, ప్రస్తుతం ఉంటుంది. అయితే నిజం ఏంటో తెలుసుకోకుండా ఒకరి పై ఒక ముద్ర వెయ్యొద్దు. ఇది అందరికి అర్ధమవుతుంది అనుకుంటా” అంటూ ఒక పోస్టు వేశాడు.

Rahul Sipligunj post on break up with BiggBoss fame Rathika Rose

ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన నెటిజెన్స్.. రాహుల్ సిప్లిగంజ్ తో రతిక రోజ్ ప్రేమ నిజమే అని ఒక అంచనాకి వచ్చారు. కాగా వీరిద్దరూ కలిసి ఒక గతంలో ఒక ఆల్బమ్ సాంగ్ లో నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ప్రేమగా మారిందని టాక్ వినిపిస్తుంది.