Cool Suresh : లేడీ యాంకర్‌తో తమిళ నటుడు తప్పు ప్రవర్తన.. భార్య అభ్యంతరంతో క్షమాపణలు..
లేడీ యాంకర్‌తో తమిళ నటుడు కూల్ సురేష్ తప్పు ప్రవర్తన. అతడి భార్య అభ్యంతరం తెలియజేయడంతో క్షమాపణలు చెబుతూ..

Tamil Actor Cool Suresh viral video with lady anchor
Cool Suresh : తమిళ నటుడు కూల్ సురేష్ ఇటీవల చేసిన ఒక పని నెట్టింట వైరల్ అయ్యి ఒక వివాదంగా మారింది. రీసెంట్ గా ఈ నటుడు ఒక తమిళ మూవీ ఫంక్షన్ కి హాజరయ్యాడు. ఆ ఫంక్షన్ లో కామెడీ పుట్టిదాం అని కూల్ సురేష్ చేసిన ఒక పని పై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫంక్షన్ లో వచ్చిన గెస్ట్ లకు పులా దండలతో గౌరవించారు. అయితే ఆ పులా దండ అందరికి వేశారు గాని, యాంకర్ గా చేస్తున్న అమ్మాయికి వెయ్యలేదని చెప్పి.. కూల్ సురేష్ వేశాడు. అయితే ఈ వేయడం ఆ అమ్మాయికి ఇబ్బందిని కలిగించింది.
Vishal : రైతులకు కేజీఎఫ్ హీరో ‘యశ్’ చేసే సహాయం గురించి ఎవరికి తెలియదు..
Worst Behaviour #CoolSuresh ?
Evan Da Adhu Clap Panni Sirikurathu !! ??pic.twitter.com/n60oBovPy7
— ????? ???????????ツ? (@Vijay_Karthik27) September 20, 2023
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఇదేమి పద్ధతి అంటూ నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ సంఘటన అంతా ఒక స్క్రిప్ట్ అని నెట్టింట కామెంట్స్ వినిపించడం మొదలయ్యాయి. దీంతో మూవీ టీం పై అందరూ ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. దీంతో ఆ సినిమాకి ఇబ్బంది వచ్చి పడింది. అయితే ఈ విషయంలో ఆ మూవీ టీంకి ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని కూల్ సురేష్ ఒక వీడియో ద్వారా అందరికి తెలియజేశాడు. ఇదంతా తను చేసిన తప్పే, ఆ చిత్ర యూనిట్ కి ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నాడు.
Salaar : నవంబర్‌లో రాబోతున్న సలార్.. రిలీజ్ డేట్ వైరల్..!
ఆ ఈవెంట్ స్టార్టింగ్ సమయంలో కూల్ సురేష్, ఆ యాంకర్ కలిసి డాన్స్ చేశాడట. దీంతో ఆమె జోవియల్ అనుకోని, కామెడీ పుట్టించడానికి అలా చేసినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఎంత పెద్ద తప్పు అయ్యిందో తనకి తరువాత తెలిసి వచ్చినట్లు కూల్ సురేష్ తెలియజేశాడు. ఈ విషయం పై తన భార్య కూడా అభ్యంతరం వెల్లడించినట్లు కూల్ సురేష్ చెప్పుకొచ్చాడు. ఆ యాంకర్ పేరు కూడా తనకి తెలియదని, తనని అందరికి తెలిసేలా క్షమాపణలు కోరుతున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
#CoolSuresh apologizes for yesterday’s #Sarakku Press meet incident.. pic.twitter.com/RLIbmVAtaj
— Ramesh Bala (@rameshlaus) September 20, 2023