Raj Kundra : మరో సెలబ్రిటీ కపుల్ విడాకులు.. నిన్నటి వరకు సరదాగా మీడియా ముందు..

సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ఇప్పుడు కామనైపోయింది. తాజాగా మరో జంట విడాకులు తీసుకునే జాబితాలో చేరింది. అయితే నిన్నటి వరకు సరదాగా కనిపించిన ఈ జంట విడాకులు తీసుకుంటున్నారనే వార్త మాత్రం సంచలనంగా మారింది.

Raj Kundra

Raj Kundra, Shilpa Shetty get divorced? : ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పెట్టిన ట్వీట్ సంచలనం రేపుతోంది. తాను శిల్పా శెట్టి విడిపోయామని ట్విట్టర్‌లో ఆయన పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది.

Tanya Appachu Kaul : ఈ కారణాలతో కూడా విడాకులు తీసుకుంటారా..? ఓ లాయర్ పోస్ట్ వైరల్

రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి జంట విడిపోతున్నారా? అవునని స్పష్టమవుతోంది. తాజాగా రాజ్ కుంద్రా ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ అందర్నీ షాక్‌కి గురి చేసింది. ‘మేము విడిపోయాం.. ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంచెం సమయం కావాలంటూ’ ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు రాజ్ కుంద్రా. గుండె పగిలిన ఇమోజీతోపాటు నమస్కరిస్తున్న గుర్తును కూడా యాడ్ చేసారు. అర్ధరాత్రి వేళ ఆయన పెట్టిన పోస్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి 2009 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి వియాన్, సమీషా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా 2021 లో 2021 లో నీలి చిత్రాల కేసులో అరెస్టైన రాజ్ కుంద్రా జైలు నుంచి విడుదల అయ్యాక చాలాకాలం మీడియా ముందుకి రాలేదు. ఒకవేళ బయటకు వచ్చిన ఎప్పుడూ మాస్క్‌తోనే కనిపించారు. ఇటీవల UT 69 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాస్క్ తీసి కనిపించారు. కొన్ని నెలలుగా తాను మాస్క్ ఎందుకు వేసుకుని తిరుగుతున్నాడో కూడా ఈ సందర్భంలో ఆయన మాట్లాడారు. ఓవైపు తనపై విచారణ కొనసాగుతుంటే మరోవైపు మీడియా రాసిన వార్తలు ఇంకా బాధించాయని..అలాగని మీడియాను బ్లేమ్ చేయనని.. వారు తమ పని చేసుకుంటూ పోయారని మాట్లాడారు. UT 69 మూవీ త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సినిమా రాజ్ కుంద్రా రియల్ లైఫ్ స్టోరిగా తెలుస్తోంది. సానవాజ్ అలీ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు.

Cricketer Shikhar Dhawan : క్రికెటర్ శిఖర్ ధావన్‌- అయేషాకు విడాకులు మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు

మొత్తానికి సెలబ్రిటీ జంటల విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఏదో ఒక కారణాలతో జంటలు విడిపోతున్నారు. వారి జాబితాలో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా కూడా చేరారు. అయితే శిల్పా శెట్టి తమ విడాకులపై స్పందించాల్సి ఉంది.