Raj Tarun – Shekar Basha : కోర్టులో ఎవిడెన్స్ శేఖర్ బాషానే తెచ్చాడు.. అతని కోసమే బిగ్ బాస్.. రాజ్ తరుణ్ వ్యాఖ్యలు..

ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ శేఖర్ బాషా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Raj Tarun Interesting Comments on Shekar Basha in Lavanya Issue

Raj Tarun – Shekar Basha : ఇటీవల రాజ్ తరుణ్ లావణ్య అనే అమ్మాయి చేసిన ఆరోపణలతో వైరల్ అయిన సంగతి తెలిసిందే. లావణ్య అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి ఒక్కో ఆరోపణ చేస్తుంది. దీనిపై రాజ్ తరుణ్ స్పందించి అవన్నీ ఆరోపణలే అని, కేసు కోర్టులో సాగుతుంది, నేను అక్కడే చూసుకుంటాను అని అన్నాడు. అయితే ఈ ఇష్యూ వైరల్ అయిన తర్వాత రాజ్ తరుణ్ కి సపోర్ట్ గా ఆర్జే శేఖర్ బాషా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆర్జే శేఖర్ బాషా లావణ్య గురించి కొన్ని ప్రూఫ్స్ తెచ్చి, లాజికల్ గా ప్రశ్నించి రాజ్ తరుణ్ కి అండగా నిలబడ్డాడు.

దీంతో శేఖర్ బాషా కూడా వైరల్ అయ్యాడు. రాజ్ తరుణ్ ఆల్రెడీ ఓ సినిమా ప్రమోషన్ లో శేఖర్ బాషాకు థ్యాంక్స్ కూడా చెప్పాడు. అయితే ప్రస్తుతం శేఖర్ బాషా బిగ్ బాస్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రాజ్ తరుణ్ భలే ఉన్నాడే సినిమా రిలీజయింది. ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వస్తుంది. చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ శేఖర్ బాషా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Also Read : NTR – Vishwak – Siddhu : విశ్వక్, సిద్ధూ జొన్నలగడ్డతో ఎన్టీఆర్ స్పెషల్ దేవర ఇంటర్వ్యూ.. ఫోటో లీక్..

రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ఆయన రావడం నాకు చాలా హెల్ప్ అయింది. కోర్టులో కూడా అతి ముఖ్యమైన ఎవిడెన్స్ ని ఆర్జే శేఖర్ భాషనే తీసుకొచ్చాడు. అతను బిగ్ బాస్ లో ఉన్నాడనే ఫస్ట్ టైం బిగ్ బాస్ చూస్తున్నాను. అతనికి ఆల్ ది బెస్ట్. రీసెంట్ గానే బిగ్ బాస్ కి వెళ్లేముందు నాలుగైదు సార్లు బాషాతో మాట్లాడాను. ఆయన నా కోసం ఫైట్ చేసింది బిగ్ బాస్ కోసం కాదు. నా కోసమే చేసాడు. ఏం జరిగినా నేను శేఖర్ బాషా కోసం నిలబడతాను. ఎప్పటికైనా నేను లేకపోయినా నా వాళ్ళు అయినా అతని కోసం నిలబెడతారు అని అన్నాడు. దీంతో రాజ్ తరుణ్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా శేఖర్ బాషా ఏం ఎవిడెన్స్ తెచ్చాడో అని చర్చించుకుంటున్నారు.