‘తిరగబడర సామీ’ మూవీ రివ్యూ.. రాజ్ తరుణ్‌ సినిమా ఎలా ఉందంటే..?

రాజ్ తరుణ్ తిరగబడర సామీ సినిమా నేడు ఆగస్టు 2న థియేటర్స్ లో రిలీజయింది.

Raj Tarun Malvi Mahotra Tiragabadara Saami Movie Review and Rating

Tiragabadara Saami Movie Review : రాజ్‌తరుణ్‌, మాల్వి మల్హోత్రా జంటగా ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో తెర‌కెక్కిన సినిమా ‘తిరగబడర సామీ’. మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, బిత్తిరి సత్తి, సుధ, రాజా రవీంద్ర.. పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కించిన ఈ సినిమాని సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మించారు. తిరగబడర సామీ సినిమా నేడు ఆగస్టు 2న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. గిరి(రాజ్ తరుణ్) చిన్నప్పుడు అమ్మ నాన్నల దగ్గర నుంచి తప్పిపోవడంతో పెద్దయ్యాక మిస్ అయిన వాళ్ళని వెతికి ఇంటికి చేర్చే పని చేస్తూ ఉంటాడు. గిరి ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక ఫ్యామిలీ అవ్వాలని కలలు కంటాడు. కానీ గిరి చేసే పని వల్ల ఎవరూ పిల్లనివ్వరు. అలాంటి సమయంలో శైలజ(మాల్వి మల్హోత్రా) అనే అమ్మాయి అనాథ అని చెప్పి గిరి లైఫ్ లోకి వచ్చి అతన్ని పెళ్లి చేసుకుంటుంది.

సాఫీగా సాగిపోతున్న గిరి లైఫ్ లో కొండారెడ్డి(మకరంద్ దేశ్ పాండే) ఎంటర్ అయి తన మేనకోడలు మిస్ అయింది కనిపెట్టి తీసుకురమ్మని శైలజ ఫోటో ఇస్తాడు. తన భార్యని వెతుకుతున్నారని తెలిసి గిరి షాక్ అవుతాడు. అసలు కొండారెడ్డి శైలజని ఎందుకు వెతుకుతున్నాడు? శైలజ ఎవరు? శైలజ గిరి లైఫ్ లోకి ఎందుకొచ్చింది? శైలజని కాపాడుకోవడానికి గిరి ఏం చేసాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Average Student Nani : ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మూవీ రివ్యూ..

సినిమా విశ్లేషణ..
రాజ్ తరుణ్ సినిమాలు ఫ్లాప్ అయినా ఏదో ఒక కొత్త పాయింట్ లేదా కొత్త కథ తన సినిమాలో చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ తిరగబడర సామీ రొటీన్ ఓల్డ్ కమర్షియల్ సినిమా. అసలే రాజ్ తరుణ్ కి హిట్స్ లేవు, డైరెక్టర్ రవికుమార్ చౌదరికి హిట్స్ లేవు. ఇలాంటి సమయంలో వీరిద్దరూ కలిసి ఓ రొటీన్ సినిమా చేయడం గమనార్హం.

ఫస్ట్ హాఫ్ అంతా గిరి పాత్ర గురించి చెప్పడం, గిరి లైఫ్ లోకి శైలజ వచ్చి పెళ్లి, కాపురం చూపిస్తారు. ఇంటర్వెల్ కి శైలజని వెతికిపెట్టమని గిరికి చెప్పడంతో నెక్స్ట్ రాజ్ తరుణ్ ఏం చేస్తాడు అని ఆసక్తి కలిగిస్తారు. ఇక సెకండ్ హాఫ్ తన భార్యని కాపాడుకోవడం కోసం గిరి ఏం చేసాడు అని విలన్, గిరి సీన్స్, మధ్యలో కామెడీతో రొటీన్ గానే ముగించారు. హీరోయిన్ కి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండటం, హీరోయిన్ ని కాపాడుకోవడానికి హీరో రంగంలోకి దిగడం.. ఇలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అందులో ఇదొకటి.

నటీనటుల పర్ఫార్మెన్స్..
సినిమా ఎలా ఉన్నా రాజ్ తరుణ్ మాత్రం తన పాత్రలో బాగానే నటిస్తాడు. మాల్వి మల్హోత్రా కూడా బాగానే నటిస్తూ అందాలు ప్రదర్శించింది. ఒకప్పటి హీరోయిన్ మన్నారా చోప్రా లేడి విలన్ గా ఓవర్ యాక్షన్ చేసినట్టు ఉంటుంది. కొండారెడ్డి విలన్ పాత్రలో మకరంద్ దేశ్ పాండే పాత సినిమాల్లో విలన్ లాగ కనిపిస్తాడు. రాజా రవీంద్ర, సుధ, గీత సింగ్, బిత్తిరి సత్తి పర్వాలేదనిపిస్తారు.

సాంకేతిక అంశాలు..
ఈ సినిమా టెక్నికల్ గా చాలా వీక్ గా ఉంది. అసలు సినిమా చూసాక సౌఖ్యం, యజ్ఞం, పిల్ల నువ్వులేని జీవితం.. లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ రవికుమార్ చౌదరి ఇలాంటి సినిమా తీసాడా అనిపిస్తుంది. రొటీన్ కథ, స్క్రీన్ ప్లే. పాటలు కూడా యావరేజ్. ఒక్క రొమాంటిక్ పాట మాత్రం బాగుంటుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అవుట్ డేటెడ్. నిర్మాణ పరంగా మాత్రం బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా తిరగబడర సామీ సినిమా రొటీన్ కమర్షియల్ సినిమా. పర్సనల్ లైఫ్ బాలేని టైంలో రాజ్ తరుణ్ కి ఈ సినిమా కూడా తిరగబడింది.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తగత అభిప్రాయం మాత్రమే

ట్రెండింగ్ వార్తలు