Raja The Raja : ‘రాజా ది రాజా’ రిలీజ్ ఎప్పుడంటే.. యూత్ ఫుల్ లవ్ స్టోరీ..
ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. (Raja The Raja)
- Saketh U
- Published on- June 23, 2026 / 02:19 PM IST
Raja The Raja
Raja The Raja : రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘రాజా ది రాజా’. కె. శ్రీలతా రెడ్డి సమర్పణలో వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారికా దాసరి నిర్మాణంలో అనిల్ బోయిడపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
రాజా ది రాజా సినిమా జూలై 17న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని తెలుగు స్టేట్స్ లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తుంది. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా హీరో, హీరోయిన్‌ల మధ్య కెమిస్ట్రీతో, వారి సరదా ప్రయాణాన్ని హైలైట్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
Also Read : Actress Kruthika : సీరియల్ నటి సోయగాలు.. పొదరిల్లు ఫేమ్ కృతికా క్యూట్ ఫోటోలు వైరల్..
ఈ సినిమాలో సాయికుమార్, డాక్టర్ నరేష్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓయి, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, భద్రం, మైమ్ మధు, ఆనంద్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లాంటి ప్రముఖ పంపిణీ సంస్థ ఈ సినిమాని విడుదల చేయడం ట్రేడ్ వర్గాల్లో సినిమాపై నమ్మకం నెలకొంది.
