Rajamouli : రాజమౌళి బర్త్‌డే స్పెషల్.. ఆయన సక్సెస్ వెనుకున్న సీక్రెట్ ఏంటి?

హీరోల వెనుక ఎప్పుడూ పడడు రాజమౌళి. ఆయన పరుగెప్పుడూ కథ వెనుకే. పాత్రల వెంబడే. క్యారక్టరైజేషన్ కోసమే. పూర్తిగా కథ, స్ర్కీన్ ప్లే లాక్ చేసుకొని కానీ హీరోలను సెలెక్ట్ చేసుకోకపోవడం జక్కన్న సక్సెస్ సీక్రెట్స్ లో ఒకటి.............

Rajamouli Birthday Special Story

Rajamouli :  సక్సెస్ మీనింగ్ కోసం డిక్షనరీ వెతికితే దర్శకుడు రాజమౌళి పేరు కనిపిస్తుంది. పర్ఫెక్షన్ కు ఆయన సరైన డెఫినిషన్. డిసిప్లైన్ కు పెట్టింది పేరు. ఎందులోనూ రాజీపడకపోవడం ఆయన క్యారక్టర్. అందుకే ఆయనకి ఫ్లాప్ సినిమా తీయడం రాదు. ఇంతకీ ఆయన సక్సెస్ వెనుకున్న సీక్రెట్ ఏంటి?

డైరెక్టర్ రాజమౌళి ఓ ప్రభంజనం. ఓ సంచలనం. ఆయన పేరు వింటే తెలుగు ఆడియన్స్ ఊగిపోతారు. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవుతుంది. హీరోలను మించిన ఫాలోయింగ్ ఆయన స్పెషాలిటీ. మిగతా సినిమాలకు హీరోను బట్టి మార్కెట్ ఉంటుంది. కానీ జక్కన్న సినిమాలకు ఆయన పేరే బ్రాండింగ్. హీరో ఎవరన్నది ముఖ్యం కాదు. తీసింది జక్కన్నా కాదా అన్నదే మెయిన్. ఆయన తీసింది పన్నెండు సినిమాలే. అయితేనేం? ఆయన క్రేజ్ వంద డైరెక్టర్ల క్రేజ్ కన్నా ఎక్కువ.

హీరోల వెనుక ఎప్పుడూ పడడు రాజమౌళి. ఆయన పరుగెప్పుడూ కథ వెనుకే. పాత్రల వెంబడే. క్యారక్టరైజేషన్ కోసమే. పూర్తిగా కథ, స్ర్కీన్ ప్లే లాక్ చేసుకొని కానీ హీరోలను సెలెక్ట్ చేసుకోకపోవడం జక్కన్న సక్సెస్ సీక్రెట్స్ లో ఒకటి. స్టోరీ కోసం ప్రాణం పెట్టడం. అందులోని పాత్రలకోసం పరితపించిపోవడం, ప్రతీ చిన్న విషయంలోనూ శ్రద్ద తీసుకోవడం. ఇలా అన్ని రకాలు గానూ తన తీయబోయే సినిమా గురించి శ్రమించడం రాజమౌళి నైజం. సినిమా పర్ఫెక్ట్ గా రావడానికి అవసరమైన ఇతర క్రాఫ్ట్స్ పై కూడా ఆయన విపరీతమైన పట్టు సాధించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్ అయినా టెక్నీషియన్స్ పనితీరు అయినా తనకి నచ్చకపోతే అసలు ఊరుకోడు రాజమౌళి. కోరుకున్న ఔట్ పుట్ వచ్చే వరకూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. బెటర్ ఔట్ పుట్ లోంచి కూడా మరింత బెటర్ ఏదైనా వస్తుందేమోనని ఎదురు చూసే అరుదైన క్వాలిటీ ఉంది ఆయనకి. ఈ ఒక్క పాయింట్ చాలదా ఆయన ఫెయిల్యూర్ ఎరుగని డైరెక్టర్ గా తనను తాను మలుచుకోడానికి?

67th Filmfare South Awards : ఘనంగా 67వ సౌత్‌ ఫిల్మ్ ఫేర్‌ అవార్డు వేడుకలు

పాత్రలతో ప్రేక్షకుల్ని ఇంటారాక్ట్ చేస్తాడు. ఎమోషన్స్ తో కాన్ఫ్లిక్ట్ ను స్ట్రాంగ్ గా కనెక్ట్ చేస్తాడు. హీరో, విలన్ మధ్య స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను ఇంప్లాంట్ చేసి ఎమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళతాడు. వాటివల్లనే ఆయన సినిమాలకు జనం అంతలా పోటెత్తేది.

ప్రతీ సినిమాలోనూ బలమైన ఎమోషనల్ ఎలిమెంట్ ను బాగా ఎలివేట్ చేస్తాడు రాజమౌళి. దాని వల్ల హీరోకి జరిగే ప్రతీదీ తనకే జరిగిందని ఫీలవుతాడు ప్రేక్షకుడు. హీరో రివెంజ్ ను తన రివెంజ్ గా భావిస్తాడు. అందుకే ఆయన సినిమాలకు ఇప్పటివరకూ అపజయం అన్నదే ఎదురవలేదు. జనం నాడిని పట్టుకోవడంలో రాజమౌళిని మించిన మొనగాడే లేడు.

హీరోయిజంతో సమానంగా విలనిజాన్ని ఎస్టాబ్లి్ష్ చేయడం రాజమౌళి మరో సక్సెస్ సీక్రెట్. స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ తో ఆ ఇద్దరి మధ్యా ఎమోషనల్ వార్ ను పీక్స్ కు తీసుకెళతాడు. క్లైమాక్స్ లో దానికి పరాకాష్టను చూపిస్తాడు. దాంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ప్రతీ సినిమాకి రాజమౌళి ఇదే ఫార్ములాను అప్లై చేస్తాడు. అందుకే ఆయన సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినమాల్లా అనిపించవు. రకరకాల జోనర్స్ లో సినిమాలు తీయడం, ఏ జోనర్ లో అయినా సినిమా తీయగలగడం ఆయనకే చెల్లింది.

చిన్నతనంలో తన తల్లి చెప్పడం వల్ల స్కూల్ బుక్స్ కన్నా ఎక్కువగా కామిక్ బుక్స్ ను చదివేవాడ్నని, దాని వల్ల తనకు బుక్స్ చదివే అలవాటు అబ్బిందని అదే తన సక్సెస్ సీక్రెట్ అని రీసెంట్ గా రాజమౌళి రివీల్ చేశాడు. అందుకేనేమో రాజమౌళికి క్యారక్టరైజేషన్ మీద బాగా గ్రిప్ దొరికి.. సినిమాను అద్బుతంగా తీయగలిగే కెపాసిటీ అలవడిందని అర్ధం చేసుకోవచ్చు. ఏదేమైనా రాజమౌళి లాంటి అద్భుతమైన డైరెక్టర్ మనకు లభించడం, ఆయన ఇండియా గర్వపడే దర్శకుడిగా ఎదగడం మనకు ఎంతైనా గర్వకారణం.