Rajamouli : సుకుమార్ – చరణ్ సినిమాపై రాజమౌళి కామెంట్స్.. ఓపెనింగ్ సీన్ హార్డ్ హిట్టింగ్ అంటూ..
తాజాగా రాజమౌళి రామ్ చరణ్ - సుకుమార్ సినిమా గురించి మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. (Rajamouli)
- Saketh U
- Updated on- November 3, 2026 / 04:54 PM IST
Rajamouli
Rajamouli : మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా ఇటీవలే ఓపెనింగ్ పూజ కార్యక్రమాలు జరుపుకుంది. రంగస్థలం తర్వాత ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ నెమలి పింఛం, చరణ్ ఫొటోతో కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. దీంతో సినిమా ఎలా ఉండబోతుందో అని చర్చిస్తున్నారు ప్రేక్షకులు.
తాజాగా రాజమౌళి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా గురించి మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. గతంలో RRR సినిమా ప్రమోషన్స్ సమయంలోనే అప్పటికే చరణ్, సుకుమార్ సినిమా ప్రకటించడంతో ఆ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు రాజమౌళి.
Also See : Nayanthara : ‘మహాశక్తి’ రిలీజ్ కి ముందు.. పూజ గది నుంచి డివోషనల్ వైబ్ ఫోటోలు షేర్ చేసిన నయనతార..
రాజమౌళి మాట్లాడుతూ.. నాకు సుకుమార్ – రామ్ చరణ్ చేయబోయే సినిమా ఓపెనింగ్ సీన్ గురించి తెలుసు. కానీ నేను అది రివీల్ చేయలేను. అది చేస్తే సుకుమార్ కి గుండెపోటు వస్తుంది. ఆ సీన్ చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. ఆ ఓపెనింగ్ సీన్ చూసినప్పుడు ఆడియన్స్ వాళ్ళ సీట్స్ లోనే వణుకుతారు అని తెలిపారు.
గతంలో రాజమౌళి RC17 సినిమా గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సినిమా ఓపెనింగ్ సమయంలో వైరల్ అవ్వడంతో అంచనాలు మరిన్ని పెరిగాయి. ఆ ఓపెనింగ్ సీన్ ఏంటి అని చర్చగా మారింది. రాజమౌళినే గొప్పగా చెప్పాడంటే ఇక ఆ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని అంచనాలు వేసుకుంటున్నారు ఫ్యాన్స్.
