Rajamouli
Rajamouli : ఎమోషన్స్, మాస్ యాక్షన్స్, ఎలివేషన్స్ తో సినిమాలు తీస్తాడు రాజమౌళి. ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఆయన సినిమాల్లో ప్రేమ, కామెడీ, యాక్షన్, సెంటిమెట్.. ఇలా అన్ని భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఒక్క హారర్ జోనర్ మాత్రం ఇప్పటిదాకా టచ్ చేయలేదు రాజమౌళి. ఎందుకంటే రాజమౌళి అసలు హారర్ సినిమాల్ని ఎక్కువగా చూడడు, ఇష్టపడడు అంట.
తాజాగా రాజమౌళి ఆహాలో రాబోతున్న హారర్ వెబ్ సిరీస్ Anya’s Tutorial ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ”నేను అసలు హారర్ సినిమాలు చూడను. హారర్ సినిమాలు ఇష్టపడను. చాలా తక్కువ హారర్ సినిమాలు చూశాను. అందులో నాకు రెండే హారర్ సినిమాలు నచ్చాయి. ఒకటి The Omen, రెండోది The Paranormal Activity. ఈ రెండు హారర్ సినిమాలు నాకు నచ్చాయి” అని తెలిపారు.
Varun Dhawan : సౌత్ లో కూడా ప్లాప్ సినిమాలున్నాయి.. బాలీవుడ్ యువ హీరో వ్యాఖ్యలు..
ఈ రెండు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. దీంతో రాజమౌళికి ఇష్టమైన హారర్ సినిమాలు ఇవే అని చెప్పగానే హారర్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు వీటి గురించి వెతుకుతున్నారట. మరి మీరు కూడా ఈ సినిమాలని చూసి ఒక్కసారి భయపడతానంటే చూసేయండి మరి.