Rajamouli : రాజమౌళి స్టాంప్ ఏ సినిమా నుంచి మొదలయింది..? స్టాంప్ తీసేద్దామనుకున్నాడు.. కానీ..

రాజమౌళి తన సినిమాలపై వేసే 'An SS Rajamouli Film' స్టాంప్ గురించి మాట్లాడారు.

Rajamouli gives Clarity on His An SS Rajamouli Film Stamp

Rajamouli : రాజమౌళి తన సినిమాలకు ‘An SS Rajamouli Film’ అనే స్టాంప్ వేసుకుంటాడని తెలిసిందే. సినిమా టైటిల్ వచ్చాక టైటిల్ పైన ఇది రాజమౌళి సినిమా అని ఒక స్టాంప్ వస్తుంది. ఈ స్టాంప్ ఆల్రెడీ గతంలో చాలా సార్లు వైరల్ అయింది. అసలు రాజమౌళి ఈ స్టాంప్ ఏ సినిమా నుంచి వేస్తున్నాడు? ఎందుకు వేస్తున్నాడో తెలుసా?

ఇటీవల రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ సంస్థ మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీ తీసింది. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఇందులో భాగంగా రాజమౌళి తన సినిమాలపై వేసే ‘An SS Rajamouli Film’ స్టాంప్ గురించి మాట్లాడారు.

Also Read : Modern Masters : రాజమౌళి మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీని తెరకెక్కించింది ఎవరో తెలుసా?

రాజమౌళి మాట్లాడుతూ.. నా ఫస్ట్ సినిమా స్టూడెంట్ నంబర్ 1 రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో చేశాను. అది నా స్టైల్ కి కొంచెం దూరంగా ఉంటుంది. నా రెండో సినిమా సింహాద్రి ఇది నా సినిమా అని చెప్పుకునేలా ఉంటుంది. సింహాద్రి సినిమాకి చివర్లో ‘ఏ ఫిలిం బై రాజమౌళి’ అని పేరు వేసుకుంటే నిర్మాత ఇది అందరు కలిసి చేసిన సినిమా కదా, అందరి సినిమా అవుతుంది. అక్కడ నీ ఒక్క పేరే ఎలా వేసుకుంటావు అని అడిగారు. దాంతో నాకు భయమేసింది. నా కష్టానికి గుర్తింపు రాదేమో అనుకున్నాను. దాంతో ‘సై’ సినిమా నుంచి ‘An SS Rajamouli Film’ అనే స్టాంప్ వేసుకుంటున్నాను. ఇది నా సినిమా అని గుర్తింపు ఉండటానికి ఆ స్టాంప్ వేశాను. కానీ కొన్నేళ్ల తర్వాత అది మరీ ఓవర్ గా ఉంది అనిపించింది. అప్పటికే అది ఒక ట్రేడ్ మార్క్ గా మారింది. నేను ఆ స్టాంప్ తీసేద్దాం అనుకున్నాను కానీ నిర్మాతలు ఒప్పుకోలేదు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆ స్టాంప్ కావాలంటున్నారు అని, ఆ స్టాంప్ వేయకపోతే నీకే ఆ సినిమా నచ్చాలేదని డిస్ట్రిబ్యూటర్స్ అనుకుంటారు అని చెప్పారు. దీంతో సినిమా బిజినెస్ కోసం ఆ స్టాంప్ కొనసాగిస్తున్నాను అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు