Rajamouli : కాంతార సినిమా వల్ల మేం ఆలోచించాల్సి వస్తుంది..

రాజమౌళి మాట్లాడుతూ.. చిన్న సినిమాలు కూడా భారీ కలెక్షన్స్ తెస్తాయని కాంతార సినిమా నిరూపించింది. భారీ బడ్జెట్ సినిమాలు ప్రత్యేకమే. కానీ ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమా కాంతార వచ్చి............

Rajamouli interesting comments on Kantara Movie

Rajamouli :  కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన సినిమా కాంతార చిన్న సినిమాగా రిలీజయి భారీ విజయం సాధించింది. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన కాంతార సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాని స్టార్స్ సైతం పొగిడారు. తాజాగా ఈ సినిమాని ఉద్దేశించి రాజమౌళి వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్.. ఈ సారి ఎంటర్టైన్మెంట్ కి మించి

రాజమౌళి మాట్లాడుతూ.. చిన్న సినిమాలు కూడా భారీ కలెక్షన్స్ తెస్తాయని కాంతార సినిమా నిరూపించింది. భారీ బడ్జెట్ సినిమాలు ప్రత్యేకమే. కానీ ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమా కాంతార వచ్చి కలెక్షన్స్ లో మ్యాజిక్ చేసింది. దీంతో సినిమా మేకింగ్ భారీగా ఉండాలి అనుకునే నాలాంటి వాళ్ళని ఇరుకున పెట్టింది ఈ సినిమా. నా లాంటి భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకులని ఆలోచలనలో పడేసింది కాంతార. సినిమా నిర్మాణ వ్యయాన్ని మరోసారి సమీక్షించుకునేలా చేసింది. ఇక నుంచి మేము సినిమా మొదలుపెట్టేటప్పుడు బడ్జెట్ ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి అని తెలిపారు.