Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్.. ఈ సారి ఎంటర్టైన్మెంట్ కి మించి

'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ తో పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమాని అనౌన్స్ చేశారు. పవన్ రాజకీయాల షెడ్యూల్స్ వల్ల, దీని కంటే ముందు హరిహర వీరమల్లు సినిమా ఉండటం వల్ల ఈ సినిమా...........

Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్.. ఈ సారి ఎంటర్టైన్మెంట్ కి మించి

Pawan Kalyan hareesh shankar movie title anounced as ustaad bhagathsingh

Updated On : December 11, 2022 / 12:02 PM IST

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు, పవన్ కెరీర్ డౌన్ లో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమా ఇచ్చి ఫ్యాన్స్ ని, పవన్ ని ఖుషి చేశాడు హరీష్ శంకర్. ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అది ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ తో పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమాని అనౌన్స్ చేశారు. పవన్ రాజకీయాల షెడ్యూల్స్ వల్ల, దీని కంటే ముందు హరిహర వీరమల్లు సినిమా ఉండటం వల్ల ఈ సినిమా డిలే అవుతుంది. ఇటీవల ఈ సినిమా తమిళ్ తేరి రీమేక్ అని వార్తలు రావడంతో పవన్ ఫ్యాన్స్ రీమేక్ అయితే చేయొద్దంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు.

SSMB 28 : జనవరి నుంచి నాన్ స్టాప్‌గా మహేష్.. సమ్మర్ కి SSMB 28 సినిమా రెడీ అంటున్న నిర్మాత..

ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ సినిమా గురించి తాజాగా అప్డేట్ ఇచ్చాడు. సినిమా టైటిల్ ని మారుస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అని అనౌన్స్ చేస్తూ పవన్ బైక్ కి ఆనుకొని స్టైల్ గా నిల్చున్న స్టైల్ తో ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో కింద మనల్ని ఎవడ్రా ఆపేది అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. అలాగే ఈ సారి ఎంటర్టైన్మెంట్ కి మించి అని కూడా పోస్టర్ పై వేశారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఎలాంటి అప్డేట్ లేకుండా సడెన్ గా ఉదయమే ఈ పోస్టర్ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ సినిమా తేరి రీమేక్ అవునో కాదో మాత్రం చెప్పలేదు హరీష్ శంకర్. త్వరలోనే ఈ సినిమా షూట్ మొదలవుతుందని ట్వీట్ లో తెలిపారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇవ్వనున్నాడు. అలాగే ఇవాళ ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ పూజా కార్యక్రమానికి హాజరు కానున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)