Suriya – Karthi – Rajamouli : సూర్య, కార్తీలతో రాజమౌళి సినిమా ప్లాన్.. కానీ.. కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా తమిళ్ స్టార్ హీరో కార్తీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Rajamouli Planned a Movie with Suriya and karthi Interesting Comments by Karthi

Suriya – Karthi – Rajamouli : రాజమౌళి బాహుబలితో ఇండియాలో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోగా ఇక RRRతో వరల్డ్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. RRR సినిమాతో ఆస్కార్ వరకు వెళ్లి హాలీవుడ్ లో కూడా పాపులర్ అయ్యారు. రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో తీయబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక నటీనటులంతా రాజమౌళి సినిమాలో పని చేయాలి అనుకుంటారు.

తాజాగా తమిళ్ స్టార్ హీరో కార్తీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తన నెక్స్ట్ సినిమా సత్యం సుందరం ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో ఓ ఇంటర్వ్యూ చేసారు కార్తీ. ఇందులో సూర్య, కార్తీ కలిసి నటించడంపై గౌతమ్ మీనన్ ప్రశ్నించగా.. కలిసి నటిస్తాం. కానీ అందుకు తగ్గ స్క్రిప్ట్ రావాలి. గతంలో రాజమౌళి సర్ మాకు ఒక కథ వినిపించారు. అది బాగానే ఉంది కానీ ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు అని కార్తీ తెలిపాడు.

Also Read : Bigg Boss Nominations : ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు..? చెత్త నామినేషన్స్..

దీంతో రాజమౌళి సూర్య, కార్తీలతో సినిమా ప్లాన్ చేసారా , అది వర్కౌట్ అయితే బాగుండేది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే కొందరు సూర్య, కార్తీలకు చెప్పింది RRR స్టోరీనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.