Rajamouli praised Prem Rakshith Master for naatu naatu song composing and prem rakshith tweeted about rajamouli comments
Prem Rakshith : RRR సినిమా ఆస్కార్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ నిలిచింది. ఇక అమెరికాలో మరిన్ని అవార్డుల ఈవెంట్స్ కి RRR యూనిట్ హాజరవుతూ, అక్కడ RRR రీ రిలీజ్ చేయడంతో ఆ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్, సెంథిల్ కుమార్, మరికొంతమంది చిత్రయూనిట్ అమెరికాలో సందడి చేస్తున్నారు. అక్కడి మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ RRR సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేస్తున్నారు.
తాజాగా రాజమౌళి హాలీవుడ్ ప్రముఖ మీడియా వ్యానిటికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో RRR సినిమా గురించి, నాటు నాటు సాంగ్ గురించి అనేక విషయాలని తెలియచేశాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గురించి కూడా మాట్లాడాడు. రాజమౌళి మాట్లాడుతూ.. నాటు నాటు సాంగ్ కి డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ అద్భుతమైన డ్యాన్స్ ని ఇచ్చాడు. ప్రేమ్ అంతకుముందే ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి పనిచేశాడు. వారి స్టైల్ అతనికి తెలుసు. వారు ఎలాంటి డ్యాన్స్ చేయగలరో, వారి బాడీ లాంగ్వేజ్ ఏంటో ప్రేమ్ కి బాగా తెలుసు. అలాగే ఆ హీరోల అభిమానులని కూడా దృష్టిలో పెట్టుకొని కంపోజ్ చేశాడు. చరణ్, తారక్ ఇద్దరికీ చెరో స్టైల్ ఉంది. కానీ ఈ పాట కోసం ఇద్దరూ కలిసి చేసేలా స్టెప్స్ డిజైన్ చేశాడు ప్రేమ్ రక్షిత్. ఈ పాట సిగ్నేచర్ స్టెప్ కోసం దాదాపు 100 కి పైగా వేరియేషన్స్ చేసి పంపించాడు. వాటిల్లో నాకు సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టమైంది. అన్నీ అంత బాగున్నాయి. నాటు నాటు సాంగ్ కి ఇప్పుడు అందరూ డ్యాన్స్ వేస్తున్నారంటే ఆ క్రెడిట్ అంతా ప్రేమ్ రక్షిత్ దే అని తెలిపారు.
Samantha : ఖుషీ షూటింగ్ మొదలుపెట్టిన టీం.. ఉమెన్స్ డే రోజు సామ్ కి గ్రాండ్ వెల్కమ్
దీనిపై డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ తన ట్విట్టర్ లో స్పందించాడు. రాజమౌళి తన గురించి చెప్పిన వీడియోని షేర్ చేస్తూ.. నా గురించి ఇంతమంచిగా చెప్పినందుకు నా గురువు రాజమౌళి సర్ కి చాలా థ్యాంక్స్. నా వర్క్ మీకు నచ్చి నన్ను అభినందిస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది. నన్ను నమ్మి RRR కోసం ఛాన్స్ ఇచ్చినందుకు, నేను దాన్ని నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ఇక అభిమానులంతా నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకోవాలని ప్రార్థిస్తున్నారు.
I thank my guru, @ssrajamouli sir, for this kind words towards me. I'm glad you enjoyed my work and appreciated my contribution,I’m grateful for ur trust in me & the opportunity to prove myself once again as a trustworthy choreographer for #RRRMovie. ❤️ u so much sir! pic.twitter.com/SPaKuHTQW9
— premrakshith (@premrakchoreo) March 7, 2023