Rajamouli : చిరంజీవి గారు చరణ్ కి ఎలాంటి సలహాలు ఇవ్వరు

ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. ''ఇంత పెద్ద సక్సెస్ లు వచ్చాక ఇంత సింపుల్ గా ఎలా ఉంటారు అని నన్ను అందరూ అడుగుతారు. చిరంజీవి గారు మనకంటే ఎన్నో సక్సెస్ లు.....

Rajamouli (1)

 

Rajamouli :  మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వనుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించగా కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా సినిమాని నిర్మించారు. ఆచార్య సినిమాకి సంబంధించి మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ(ఏప్రిల్ 23న) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగింది. ఈ ఈవెంట్ కి మెగా అభిమానులు భారీగా తరలి వచ్చారు.

 

ఈ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. ”ఇంత పెద్ద సక్సెస్ లు వచ్చాక ఇంత సింపుల్ గా ఎలా ఉంటారు అని నన్ను అందరూ అడుగుతారు. చిరంజీవి గారు మనకంటే ఎన్నో సక్సెస్ లు చూశారు, ఆయనే ఇంత సింపుల్ గా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలనేది ఆయన నుంచి నేర్చుకోవాలి. డైరెక్టర్ కథ ఎంత బాగా రాసుకున్నా టెక్నీషియన్స్ సపోర్ట్ లేకపోతే అది బాగా రాదు. టెక్నీషియన్స్ అంతా బాగా వర్క్ చేశారు. సెట్ ని బాగా డిజైన్ చేశారు. వెళ్లి చూద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. కచ్చితంగా సెట్ ని చూస్తాను. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. చరణ్ గురించి మూడు నెలలుగా మాట్లాడుతూనే ఉన్నాను. మగధీర సినిమా అప్పుడు కథ చిరంజీవి గారు వింటే చరణ్ కి సంబంధించి అన్ని ఆయనే చూసుకుంటారు అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది చిరంజీవి గారు చరణ్ కి ఎలాంటి సలహాలు ఇవ్వరు. చరణ్ సొంతంగా ఎదిగాడు. మెగాస్టార్ కొడుకైనా ఇవాళ సొంతంగా ఎదిగాడు. చిరంజీవి గారు తన పక్కన ఉన్న వారితో పోటీ పడి మరీ యాక్ట్ చేశారు. కొరటాల శివ చాలా సైలెంట్ గా ఉన్నా ఎక్కువ కష్టపడతారు. మెసేజ్ లతో మంచి సినిమాలు ఇచ్చారు. కొరటాల శివ బిగ్గెస్టు మాస్ డైరెక్టర్. ఆచార్యలో మాస్ చూస్తారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అది నాకు తెలుసు” అని తెలిపారు.

Koratala Shiva : మా నాలుగేళ్ళ కష్టం ఈ సినిమా

ఇప్పటికే ఈ సినిమా నుంచి లాహే లాహె, నీలాంబరి, సానా కష్టం, భలే భలే బంజారా లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయి భారీ స్పందన తెచ్చుకున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఆచార్య సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.