NTR – Rajeev Kanakala : ఎన్టీఆర్‌తో స్నేహంపై రాజీవ్ కనకాల వ్యాఖ్యలు.. ఒకప్పుడు బాగా కలిసేవాడు.. కానీ ఇప్పుడు..

గతంలో రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ ఇద్దరూ వీరి స్నేహంపై అనేకసార్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్తారు, తిరుగుతారు, ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్ళు అని వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు. గతంలో ఇద్దరూ కలిసి కనపడేవాళ్లు. కానీ ఇటీవల ఇద్దరూ కలిసి కనపడిన సందర్భాలు చాలా తక్కువ.

Rajeev Kanakala Comments on Friendship With NTR Gap Between NTR and Rajeev kanakala

NTR – Rajeev Kanakala Friendship :  సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్నేహితులు ఉంటారు. అందులో కొంతమంది బయట కూడా బాగా పాపులర్ అవుతారు. అలాంటి వాళ్ళల్లో ఎన్టీఆర్, రాజీవ్ కనకాల ఒకరు. వీరిద్దరూ చాలా క్లోజ్ అని అందరికి తెలుసు. ఇండస్ట్రీతో పాటు బయట అభిమానులకు, జనాలకు కూడా ఎన్టీఆర్, రాజీవ్ కనకాల చాలా క్లోజ్ అని తెలుసు. ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాడు. ఇటీవల వచ్చిన RRR సినిమాలో ఎన్టీఆర్ గురించి చెప్తూ ఆ క్యారెక్టర్ ని పరిచయం చేసేది కూడా రాజీవ్ కనకాలనే.

గతంలో రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ ఇద్దరూ వీరి స్నేహంపై అనేకసార్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్తారు, తిరుగుతారు, ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్ళు అని వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు. గతంలో ఇద్దరూ కలిసి కనపడేవాళ్లు. కానీ ఇటీవల ఇద్దరూ కలిసి కనపడిన సందర్భాలు చాలా తక్కువ. దీంతో వీరిద్దరి మధ్య ఏమైనా గ్యాప్ వచ్చిందా అని పలు అనుమానాలు కూడా వచ్చాయి. తాజాగా రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో ఎన్టీఆర్ తో స్నేహం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం వాళ్ళ రిలేషన్ గురించి కూడా తెలిపాడు.

Raashii Khanna : రాశీఖన్నాకు బ్రేకప్ అయిందా? బ్రేకప్ వల్ల బరువు పెరిగా.. డేటింగ్ వల్ల బరువు తగ్గా.. రాశీఖన్నా వ్యాఖ్యలు..

రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. మేమిద్దరం బాగానే ఉన్నాం. మా స్నేహం ఇంకా కొనసాగుతుంది. అతనితో కలిసి చాలా సినిమాలు చేశాను. మొన్న RRR కూడా చేశాను. ఒకప్పుడు బాగా కలిసేవాళ్ళం, తిరిగేవాళ్ళం. షూటింగ్ సెట్స్ కి వెళ్లి మరీ కలిసేవాళ్ళం. కానీ ప్రస్తుతం తారక్ చాలా బిజీగా ఉన్నాడు. ఇక పిల్లలు పెద్దగా అవుతుండటంతో తనకి ఖాళీ దొరికితే ఫ్యామిలీతో సమయం గడపడానికి చూస్తున్నాడు. అందుకే బయటకి వచ్చి మాకు టైం ఇచ్చి మమ్మల్ని కలవట్లేదు. ఇప్పుడు ఇంకా పెద్ద హీరో అవ్వడంతో అతని స్క్రిప్ట్స్, సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు. అతను బిజీగా ఉండటం వల్ల మేము బయట కలవట్లేదు అంతే కానీ మా మధ్యలో ఏం గ్యాప్ రాలేదు. ఇటీవల కొన్ని రోజుల క్రితం షూటింగ్ సెట్ కి రమ్మని ఫోన్ కూడా చేశాడు. కానీ నాకు వేరే పని ఉండటం వల్ల వెళ్లడం కుదరలేదు. మేమిద్దరం ఇటీవల కలవకపోయినా అప్పుడప్పుడు ఫోన్ లో టచ్ లో ఉంటున్నాం. మా స్నేహం అలాగే ఉంటుంది అని తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు