Raashii Khanna : రాశీఖన్నాకు బ్రేకప్ అయిందా? బ్రేకప్ వల్ల బరువు పెరిగా.. డేటింగ్ వల్ల బరువు తగ్గా.. రాశీఖన్నా వ్యాఖ్యలు..

రాశీఖన్నా ఇటీవల తన అందాల డోసు పెంచి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాశి ఖన్నా తన బ్రేకప్, డేటింగ్ గురించి వ్యాఖ్యలు చేసింది.

Raashii Khanna : రాశీఖన్నాకు బ్రేకప్ అయిందా? బ్రేకప్ వల్ల బరువు పెరిగా.. డేటింగ్ వల్ల బరువు తగ్గా.. రాశీఖన్నా వ్యాఖ్యలు..

Raashii Khanna tells about her breakup and relation story but boy friend not revealed

Raashii Khanna : రాశీఖన్నా తెలుగులో మనం సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి అనంతరం ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగులో వరుస సినిమా ఆఫర్స్ వచ్చాయి. దీంతో తెలుగులో మీడియం, స్టార్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఆ తర్వాత తమిళ్, మలయాళంలో కూడా సినిమాలు చేసింది. ప్రస్తుతం రాశీఖన్నా తమిళ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.

రాశీఖన్నా ఇటీవల తన అందాల డోసు పెంచి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాశి ఖన్నా తన బ్రేకప్, డేటింగ్ గురించి వ్యాఖ్యలు చేసింది. రాశీఖన్నా మాట్లాడుతూ.. గతంలో ఓ వ్యక్తితో డేటింగ్ చేశాను. కానీ అతనితో బ్రేకప్ అవ్వడంతో చాలా డిప్రెషన్ కి గురయ్యాను. నాకు థైరాయిడ్ సమస్య కూడా ఉండటంతో బరువు బాగా పెరిగాను. ఎన్ని వర్కౌట్స్ చేసినా, జిమ్ కి వెళ్లినా బరువు తగ్గలేదు. దాంతో నేను బొద్దుగా తయారయ్యానని హీరోయిన్ ఆఫర్లు కూడా తగ్గాయి. అయితే నన్ను అర్ధం చేసుకునే ఓ వ్యక్తి వచ్చాక అతనితో డేటింగ్ మొదలుపెట్టాను. అతనితో డేటింగ్ మొదలుపెట్టాక మళ్ళీ నేను బరువు తగ్గాను. చాలా స్లిమ్ అయ్యాను అని తెలిపింది.

Anikha surendran : ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఏకంగా ధనుష్ పక్కనే హీరోయిన్ గా??

అంటే రాశి ప్రస్తుతం డేటింగ్ లో ఉందని, గతంలో ఆల్రెడీ ఒక బ్రేకప్ అయిందని చెప్తుంది. అయితే ఎవరితో డేటింగ్ లో ఉందో మాత్రం చెప్పలేదు. దీంతో అభిమానులు, నెటిజన్లు ఎవరితో డేటింగ్ లో ఉంది, రాశీఖన్నా బాయ్ ఫ్రెండ్ ఎవరు అని కామెంట్స్ చేస్తున్నారు.