Anikha surendran : ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఏకంగా ధనుష్ పక్కనే హీరోయిన్ గా??

తాజాగా అనికా సురేంద్రన్ ఏకంగా ధనుష్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. ధనుష్(Dhanush) త్వరలో కెప్టెన్ మిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. దీని తర్వాత ధనుష్ సొంత దర్శకత్వంలో తన 50వ సినిమా తెరకెక్కించనున్నాడు.

Anikha surendran : ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఏకంగా ధనుష్ పక్కనే హీరోయిన్ గా??

Anikha surendran will play lead role in Dhanush 50th movie

Updated On : August 2, 2023 / 8:31 AM IST

Anikha surendran :  అనికా సురేంద్రన్.. ఒకప్పుడు మలయాళం, తమిళ్ లో చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అజిత్(Ajith)ఎంతవాడు గాని, విశ్వాసం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. తెలుగులో ది ఘోస్ట్ సినిమాలో కనిపించింది. బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనికా. ప్రస్తుతం మలయాళం, తమిళ్ లో పలు సినిమాలు చేస్తోంది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేసిన అనికా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది సౌత్ లో.

తాజాగా అనికా సురేంద్రన్ ఏకంగా ధనుష్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. ధనుష్(Dhanush) త్వరలో కెప్టెన్ మిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. దీని తర్వాత ధనుష్ సొంత దర్శకత్వంలో తన 50వ సినిమా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో అనికా సురేంద్రన్ ని ఒక మెయిన్ లీడ్ గా తీసుకున్నట్టు సమాచారం. తమిళ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.

SIIMA Awards 2023 : సైమా అవార్డ్స్.. RRR, సీతారామం సినిమాలకి హైయెస్ట్ నామినేషన్స్.. ఈ సారి బెస్ట్ ఫిలిం అవార్డు దేనికో?

ఇటీవల అనికా మాల్దీవ్స్ కి వెళ్లి అక్కడి నుంచి హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అలరిస్తుంది. దీంతో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ అప్పుడే హీరోయిన్ అయిపోయి ఏకంగా ధనుష్ తో నటించేస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు.