SIIMA Awards 2023 : సైమా అవార్డ్స్.. RRR, సీతారామం సినిమాలకి హైయెస్ట్ నామినేషన్స్.. ఈ సారి బెస్ట్ ఫిలిం అవార్డు దేనికో?

తాజాగా సైమా అవార్డులకు నామినేషన్స్ ప్రకటించారు. 2022 సంవత్సరంలో రిలీజయిన సినిమాలకు ఈ సంవత్సరం అవార్డులు ఇస్తారు. తెలుగులో అత్యధికంగా RRR సినిమా 11 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుంది.

SIIMA Awards 2023 : సైమా అవార్డ్స్.. RRR, సీతారామం సినిమాలకి హైయెస్ట్ నామినేషన్స్.. ఈ సారి బెస్ట్ ఫిలిం అవార్డు దేనికో?

SIIMA Awards 2023 Nominations and Other Details in Telugu RRR and Sita Ramam Movies gets Highest Nominations

SIIMA Awards 2023 :  సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) అవార్డు వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయని తెలిసిందే. ఈసారి కూడా సెప్టెంబర్ 15, 16 తేదీల్లో దుబాయిలో ఘనంగా సైమా వేడుకలు జరగనున్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలకు చెందిన సినిమాలకు ఈ అవార్డు వేడుకలు జరుగుతాయి.

తాజాగా సైమా అవార్డులకు నామినేషన్స్ ప్రకటించారు. 2022 సంవత్సరంలో రిలీజయిన సినిమాలకు ఈ సంవత్సరం అవార్డులు ఇస్తారు. తెలుగులో అత్యధికంగా RRR సినిమా 11 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత సీతారామం సినిమా 10 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుంది. తెలుగులో బెస్ట్ ఫిలిం కేటగిరిలో RRR, సీతారామం, కార్తికేయ 2, మేజర్, డీజే టిల్లు సినిమాలు పోటీలో ఉన్నాయి. మరి వీటిల్లో ఏ సినిమా ఈ సారి సైమా బెస్ట్ ఫిలిం అవార్డు సాధిస్తుందో చూడాలి.

తమిళ్ లో పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాకు అత్యధికంగా 10 నామినేషన్స్ రాగా, కమల్ హాసన్ విక్రమ్ సినిమాకు 9 నామినేషన్స్ వచ్చాయి. తమిళ్ లో బెస్ట్ ఫిలిం కేటగిరిలో లవ్ టుడే, పొన్నియిన్ సెల్వన్ 1, రాకెట్రి, తిరు, విక్రమ్ సినిమాలు పోటీలు ఉన్నాయి.

కన్నడలో KGF 2, కాంతార సినిమాలు అత్యధికంగా 11 నామినేషన్స్ సాధించాయి. కన్నడలో బెస్ట్ ఫిలిం కేటగిరిలో 777 చార్లీ, కాంతార, KGF 2, లవ్ మాక్ టైల్ 2, విక్రాంత్ రోనా సినిమాలు పోటీలో ఉన్నాయి.

Bro Movie : పవన్ రెమ్యునరేషన్, బ్రో బడ్జెట్ పై వస్తున్న విమర్శలకు నిర్మాత గట్టి కౌంటర్.. 

మలయాళంలో భీష్మపర్వం సినిమా అత్యధికంగా 8 నామినేషన్లు, తుళ్లుమల్ల సినిమా 7 నామినేషన్లు దక్కిండుకుంది. మలయాళం బెస్ట్ కేటగిరి ఫిలింలో భీష్మ పర్వం, జయ జయ జయ జయహే, హృదయం, తుళ్లుమల్ల, నా తాన్ కేస్ కోడు, జనగణమన సినిమాలు పోటీలో ఉన్నాయి.