పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ట్వీట్ రచ్చ రచ్చ అవుతోంది.
హింస తనకు చాలా బాధ కలిగిస్తోందని ఆయన చేసిన ట్వీట్‌పై కొందరు నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తుంటే..మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై మీ స్టాండ్ ఏంటీ అని నిలదీస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం పక్కన పెడితే..హింసకు పాల్పడవద్దన్న సూచనను స్వాగతిస్తున్నారు. #IStandWithRajinikanth పేరిట యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చిందంటే..ట్విట్టర్‌లో ఎంత రచ్చ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
సమస్యకు హింస పరిష్కారం కాదన్నారు రజనీ. దేశంలో జరుగుతున్న హింస బాధ కలిగిస్తోందన్నారు. ప్రజలు శాంతియుతంగా, అందరూ ఐక్యతతో మెలగాలని పిలుపునిచ్చారు. దేశం యొక్క భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఐక్యంగా..అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక రజనీ విషయానికి వస్తే..ఆయన నటించిన దర్బార్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్‌లకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. సంక్రాంతి కానుకగా..జనవరి 9న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నివేదా థామస్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. హిందీ నటుడు సునీల్ శెట్టి, యోగి బాబు, తంబి రామయ్య తదితరులు నటించారు. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించారు.
* కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.
* ఢిల్లీలోని జామియా వర్సిటీలో విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జీపై తీవ్ర విమర్శలు వినిపించాయి.
* ఆందోళనలు ఇతర రాష్ట్రాలకు, వర్సిటీలకు పాకాయి.
* పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, వామపక్షాలు, విద్యార్థులు ఎంతో మంది ఆందోళనలో పాల్గొన్నారు.
* ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటకలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
* పోలీసులపైకి రాళ్లు రువ్వడం..వారిని తరిమి తరిమి కొట్టారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Read More : పౌరసత్వ సవరణం : పోలీసులను తరిమి తరిమి కొట్టారు