Rajinikanth : కూతురి దర్శకత్వంలో రజినీకాంత్.. గెస్ట్ అప్పీరెన్స్‌గా..

రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ మరోసారి మెగా ఫోన్ పట్టనుంది. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో ఐశ్వర్య దర్శకురాలిగా కొత్త సినిమాని ప్రకటించారు. తమిళ హీరోలు.........

Rajinikanth guest role in his daughter aishwarya movie

Rajinikanth :  రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ మరోసారి మెగా ఫోన్ పట్టనుంది. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో ఐశ్వర్య దర్శకురాలిగా కొత్త సినిమాని ప్రకటించారు. తమిళ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ లు హీరోలుగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘లాల్ సలాం’ అనే టైటిల్ తో రానుంది ఈ సినిమా. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

Sowmya Rao : ఎట్టకేలకు జబర్దస్త్‌కి కొత్త యాంకర్.. అనసూయ, రష్మిలని మరిపిస్తుందా??

తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని బట్టి చూస్తే క్రికెట్, క్రికెట్ కి సంబంధించిన గొడవల మీద ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తుంది. కానీ టైటిల్ మాత్రం దీనికి డిఫరెంట్ గా ఉంది. దీంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అలాగే ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో రజిని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చిన్న కూతురు దర్శకత్వంలో ఓ సినిమా చేసిన రజినీకాంత్ ఇప్పుడు పెద్ద కూతురు దర్శకత్వంలో ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నారు.