Rajinikanth house flooded by Michaung Cyclone video gone viral
Rajinikanth : మిగ్‌జామ్ తుపాను చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసేసింది. రోడ్డులు, ఇల్లు వరదనీరుతో నిండిపోయి కరెంటు పోవడం, కమ్యూనికేషన్ కట్ అవ్వడం, ఆహారం కూడా లేకపోవడంతో జన జీవనాన్ని స్తంభించిపోయింది. ఈ వరద బీభత్సంతో కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాదు కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారు. వారి భవంతుల్లోకి కూడా వరద నీరు చొచ్చుకొచ్చాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నివాసం కూడా ఈ వరదలతో నీటమునిగింది.
ఒక అభిమాని రజినీకాంత్ నివాసానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో రజిని ఇల్లు పాదాలు లోతు వరద నీటితో కనిపిస్తుంది. ఈ ఏడాది జైలర్ సినిమాకి గాను రజిని సౌత్ లోనే అత్యధిక పారితోషకం అందుకున్న నటుడిగా సంచలనం సృష్టించారు. దాదాపు 200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్న సూపర్ స్టార్ ఇల్లు కూడా వరదల్లో మునగడంతో.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియో వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.
Poes Garden in and around #Thalaivar house . #CycloneMichuang | #ChennaiFloods | #Chennai | #ChennaiRainsHelp23 | #ChennaiFloods2023 | #Rajinikanth | #SuperstarRajinikanth | #superstar @rajinikanth pic.twitter.com/b88c5CqDgZ
— Suresh balaji (@surbalutwt) December 6, 2023
ఇక రజినీ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తలైవర్ 170 సినిమా షూటింగ్ జరుగుతుంది. ‘జై భీమ్’ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దసరా విజయన్, రక్షన్ లు వంటి భారీ తారాగణం కనిపించబోతుంది. ఈ చిత్రంతో పాటు కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలామ్’ సినిమాలో కూడా రజినీ నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమలో రజిని కేవలం ఒక ముఖ్య పాత్ర మాత్రమే చేస్తున్నారు. మెయిన్ లీడ్ లో హీరో విష్ణు విశాల్ నటిస్తున్నారు.