×
Ad

Hum Mein Shahenshah Kaun: 37 ఏళ్ల క్రితం షూటింగ్.. రిలీజ్ వాయిదాలు పడి పడి.. చివరకు రిలీజ్ అవుతున్న రజినీకాంత్ సినిమా..

37 ఏళ్లుగా వాయిదా పడుతున్న రజనీకాంత్ 'హమ్ మే షహెన్‌షా కౌన్(Hum Mein Shahenshah Kaun)' సినిమా ఏప్రిల్ లో విడుదల కాబోతుంది.

Rajinikanth Hum Mein Shahenshah Kaun movie releasing in april

రజనీకాంత్ హిందీ సినిమా ‘హమ్ మే షహెన్‌షా కౌన్’

37 ఏళ్లుగా వాయిదా

ఎట్టకేలకు విడుదల అవుతున్న సినిమా

Hum Mein Shahenshah Kaun: సినిమాలు రిలీజ్ ఆలస్యం అవడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అది కూడా ఒకరోజు, ఒకవారం.. మహా అయితే ఒక నెల ఉండొచ్చు కానీ, ఒక హిందీ సినిమా ఏకంగా 37 ఏళ్లుగా వాయిదాలోనే ఉంది తెల్సా. 37 ఏళ్ళ క్రితం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇంతవరకు విడుదల కాలేదు. మళ్ళీ ఈ సినిమాలో హీరో మీరెవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్.

రజనీకాంత్ హిందీలో చాలా సినిమాలు చేశాడు అందులో ‘హమ్ మే షహెన్‌షా కౌన్(Hum Mein Shahenshah Kaun)’ ఒకటి. 1989లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను దర్శకుడు దివంగత హర్మేష్ మల్హోత్రా తెరకెక్కించాడు. ఈ సినిమాలో రజినీకాంత్, శత్రుఘ్న సిన్హాతో కలిసి నటించారు. ఇంకా ఈ సినిమాలో హేమ మాలిని, అనితా రాజ్, ప్రేమ్ చోప్రా, శరద్ సక్సేనా, అమ్రిష్ పూరి, జగ్దీప్ లాంటి దిగ్గజాలు నటించారు.

Golla Ramavva: ఓటీటీలో విడుదలవుతున్న ‘గొల్ల రామవ్వ’.. జనవరి 25 నుంచి స్ట్రీమింగ్!

ఇంకా ఈ సినిమాకు సంగీతం లక్ష్మీకాంత్-ప్యారేలాల్, సాహిత్యం ఆనంద్ బక్షి, కొరియోగ్రఫీని సరోజ్ ఖాన్, సలీం-ఫైజ్ సంభాషణలు అందించారు. ఇలాంటి దిగ్గజాలు పనిచేసిన ఈ సినిమాను రాజా రాయ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. దానికి కారణం, ‘హమ్ మే షహెన్షా కౌన్ షూటింగ్ పూర్తయిన తర్వాత నిర్మాత రాజా రాయ్ వ్యాపార నిమిత్తం లండన్ వెళ్లాడు.

అతని చిన్న కుమారుడు అక్కడ మరణించాడు. దాంతో, ఈ ప్రాజెక్ట్ తాత్కాలికంగా ఆగిపోయింది. ఆ తరువాత కొంతకాలానికి దర్శకుడు హర్మేష్ మల్హోత్రా కూడా కన్నుమూశారు. అలా ఈ సినిమా ఇంతకాలం పాటు విడుదలకు నోచుకోలేదు. కానీ, ఈ సినిమా అసోసియేట్ నిర్మాతలు అస్లాం మీర్జా, షబానా మీర్జా మాత్రం పట్టువదలలేదు. ఈ సినిమాను పునరుద్ధరించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇంతకాలానికి వారి ప్రయత్నాలు విజయవంతమయ్యాయి.

ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్ 2026లో ఈ సినిమా విడుదల కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను, AIని ఉపయోగించి ఈ సినిమాను పునరుద్ధరించారు. విజువల్స్, సౌండ్ నాణ్యతను పెంచారు. అందుకోసం 4K రీమాస్టరింగ్, 5.1 సరౌండ్ సౌండ్ మాస్టరింగ్ ను జత చేశారు. విజువల్స్‌ను మెరుగుపరచడానికి AIని ఉపయోగించారట. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో అస్లాం మీర్జా ఈ విషయాలను తెలిపారు. మరి 37 ఏళ్ళ తరువాత వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూడాలి.