Golla Ramavva: ఓటీటీలో విడుదలవుతున్న ‘గొల్ల రామవ్వ’.. జనవరి 25 నుంచి స్ట్రీమింగ్!

జనవరి 25 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్న 'గొల్ల రామవ్వ(Golla Ramavva)' సినిమా.

Golla Ramavva: ఓటీటీలో విడుదలవుతున్న ‘గొల్ల రామవ్వ’.. జనవరి 25 నుంచి స్ట్రీమింగ్!

Golla Ramavva movie streaming on ETV Win OTT.

Updated On : January 24, 2026 / 4:39 PM IST
  • “మౌనమే నీ భాష” టీం నుంచి ‘గొల్ల రామవ్వ’ మూవీ
  • జనవరి 25 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్
  • ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖుల ప్రశంసలు

Golla Ramavva: ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘గొల్ల రామవ్వ’. స్వర్గీయ భారత ప్రధాని పి.వి.నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపంగా ఈ సినిమా తెరకెక్కింది. తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ పాత్ర పోషించిన ఈ సినిమాను సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్, వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకంపై రామ్ విశ్వాస్ హనూర్కర్, రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జనవరి 25 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.

Ashika Ranganath: చీరలో అందాలు ఆరబోస్తున్న ఆషిక రంగనాథ్.. ఫొటోలు

ఇందులో భాగంగానే తాజాగా ‘గొల్ల రామవ్వ(Golla Ramavva)’ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ లో పి.వి.నరసింహారావు తనయులు పి.వి.ప్రభాకరరావు, కూతురు బారాస ఎమ్.ఎల్.సి. శ్రీమతి సురభి వాణీదేవి, ప్రముఖ గీత రచయితలు కాసర్ల శ్యామ్, మౌనశ్రీ మల్లిక్, ప్రముఖ నటులు రాజీవ్ కనకాల, “రజాకార్” దర్శకులు యాటా సత్యనారాయణ, సీనియర్ దర్శకులు ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా వాణీదేవి మాట్లాడుతూ.. మా నాన్నగారు రాసిన గొప్ప కథల్లో ఒకటైన “గొల్ల రామవ్వ”ను ఎంతో గొప్పగా తెరకెక్కించారని ప్రశంసించారు. ఈనెల 25 నుంచి ఈటీవీ విన్ లో ప్రసారం కానున్న ఈ సినిమా తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం దక్కించుకుంటుందని పేర్కొన్నారు” ఆమె అన్నారు