Jailer 2: చెన్నై ఎయిర్ పోర్ట్ లో రజినీ.. ‘జైలర్ 2’ రిలీజ్ అప్డేట్ ఇచ్చేశాడు.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ

జైలర్ 2(Jailer 2) రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్.

rajinikanth interesting comments on jailer 2 movie release

  • ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన రజినీకాంత్
  • జైలర్ 2 రిలీజ్ పై ఆసక్తికర కామెంట్స్
  • త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది

Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఎటువంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి, కోలీవుడ్‌లో రజనీ స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ భారీ విజయంతో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జైలర్ 2(Jailer 2)’ సిద్ధమవుతోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాపై ప్రస్తుతం సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mardaani 3: నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్.. దెబ్బకు పత్తాలేకుండా పోయిన ‘ధురంధర్’

ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే, ఇటీవల చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడిన సూపర్ స్టార్ రజనీకాంత్, ‘జైలర్ 2’ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం నిర్మాణానంతర పనులు చివరి దశలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే సన్ పిక్చర్స్ సంస్థ అధికారికంగా విడుదల తేదీని ప్రకటిస్తుందని వెల్లడించారు.

ఇక ఈ సీక్వెల్‌లో మోహన్ లాల్, శివరాజ్‌కుమార్ కీ రోల్స్ చేస్తుండగా, బాలీవుడ్ నటులు మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్ కూడా స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. అలాగే ఎస్.జె. సూర్య విలన్ గా, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇన్ని ప్రత్యేకతల మధ్య వస్తున్న జైలర్ 2 ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. జైలర్ సినిమాకు తన మ్యాజికల్ మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనిరుద్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందించనున్నాడు.