Jailer 2 : డబ్బింగ్ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంపు.. జైలర్ 2 సినిమాకు ఎంత పెంచారంటే..
తాజాగా రజినీకాంత్ జైలర్ 2 సినిమాకు టికెట్ రేట్లు పెంచారు. (Jailer 2)
- Saketh U
- Published on- October 9, 2026 / 08:55 PM IST
Jailer 2
Jailer 2 : ఇటీవల టికెట్ రేట్ల పెంపు విషయంపై విమర్శలు వస్తున్నా, టికెట్ రేట్లు పెంచని సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తున్నా నిర్మాతలు మాత్రం మారట్లేదు. కొన్ని సినిమాలకు టికెట్ రేట్ల పెంచమని ప్రభుత్వాలని అడుగుతున్నారు. పోనీ తెలుగు సినిమాలకే అంటే అనుకోవచ్చు డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచి పర్మిషన్ తెచ్చుకుంటున్నారు. తాజాగా రజినీకాంత్ జైలర్ 2 సినిమాకు టికెట్ రేట్లు పెంచారు.
జైలర్ 2 సినిమాకు టికెట్ రేట్లు పెంచడానికి పర్మిషన్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం జైలర్ 2 రిలీజ్ అక్టోబర్ 15 నుంచి 21 అక్టోబర్ వరకు సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు, మల్టిప్లెక్స్ లలో 75 రూపాయలు పెంచుకునేలా పర్మిషన్ ఇచ్చారు. అలాగే రోజుకు 5 షోలు కూడా వేసుకునేలా పర్మిషన్ ఇచ్చారు. దీంతో డబ్బింగ్ సినిమాకు కూడా టికెట్ రేట్ల పెంపు అవసరమా అని విమర్శలు వస్తున్నాయి. తెలంగాణాలో కూడా టికెట్ రేట్ల పెంపు ఉంటుందని, త్వరలోనే జీవో వస్తుందని సమాచారం.
