Jailer Movie Collections : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’(Jailer) సినిమా ఆగస్టు 10న గ్రాండ్ గా రిలీజయి భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో తమన్నా (Tamannaah), కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, సునీల్.. లాంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించారు.
జైలర్ సినిమా భారీ విజయం సాధించింది. రజినీకాంత్ తో పాటు శివరాజ్ కుమార్, మోహన్ లాల్ గెస్ట్ అప్పీరెన్స్ అదిరిపోయాయి. ఇక అనిరుద్ BGM జైలర్ సినిమాకు బాగా ప్లస్ అయింది. తమిళనాడులోనే కాక అన్నిచోట్లా జైలర్ సినిమా భారీ విజయం సాధించింది. జైలర్ సినిమా మోదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. రెండో రోజు 56 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. జైలర్ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఆల్మోస్ట్ 75 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది.
Jailer Movie : జైలర్ సినిమాలో బాలకృష్ణను కూడా పెడదామనుకున్నా.. కానీ..
నేడు, రేపు కూడా వీకెండ్ కావడంతో ఈ రెండు రోజుల్లో ఇంకో 100 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. జైలర్ సినిమా పెద్ద హిట్ అవ్వడం, సౌత్ లో పోటీకి పెద్ద సినిమాలేవీ లేకపోవడం, చిరంజీవి భోళా శంకర్ నిరాశపరచడంతో జైలర్ కి మరింత కలిసొస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే జైలర్ సినిమా 15 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. తెలుగులో కూడా ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉండి. ఇక అమెరికాలో అయితే ఏకంగా రెండు రోజులోనే మూడు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది జైలర్ సినిమా.
#Jailer WW Box Office
CROSSES ₹1️⃣5️⃣0️⃣ cr gross mark in just 2 days.
Day 1 – ₹ 95.78 cr
Day 2 – ₹ 56.24 cr
Total – ₹ 152.02 crAll set to breach ₹200 cr club today.
||#Rajinikanth | #ShivaRajkumar | #Mohanlal || pic.twitter.com/BI37sFHuWK
— Manobala Vijayabalan (@ManobalaV) August 12, 2023