Site icon 10TV Telugu

రజినీకాంత్ ‘లాల్ స‌లామ్‌’ ట్విట్టర్ టాక్ ఏంటి.. ఆడియన్స్ ఏమంటున్నారు..?

Rajinikanth Lal Salaam Movie Twitter Review and Public Talk

Rajinikanth Lal Salaam Movie Twitter Review and Public Talk

Lal Salaam Twitter Review : రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దాదాపు ఏడేళ్ల విరామం తరువాత మళ్ళీ డైరెక్టర్ గా భాద్యతలు తీసుకోని తెరకెక్కించిన సినిమా ‘లాల్ స‌లామ్‌’. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజినీకాంత్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అలాగే భారత్ క్రికెటర్ కపిల్ దేవ్, జీవిత రాజశేఖర్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తమిళ్, తెలుగు భాషల్లో నేడు గ్రాండ్ గా రిలీజయింది. మరి సినిమా చూసిన ఆడియన్స్ ఏమంటున్నారు..?

Also read : Eagle Twitter Review : రవితేజ ‘ఈగల్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఏంటి..?

ఫ్యాన్స్ ని విజిల్స్ వేయించేలా మూవీలో పెద్దగా సీన్స్ ఏమి లేవట. పూర్తి ఎమోషనల్ స్టోరీతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా కథ ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా సౌత్ అండ్ రూరల్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా మూవీ ఉందని పేర్కొంటున్నారు.

మూవీ ఫస్ట్ హాఫ్ లో రజినీకాంత్ 20 నిముషాలు మాత్రమే కనిపిస్తారట. ఇక ముస్లింగా రజినీకాంత్ గెటప్ అయితే చాలా బాగుందట. ఐశ్వర్య రజినీకాంత్ ఈ సినిమాని డైరెక్ట్ చేయడం విషయంలో దర్శకుడు వెట్రిమారన్ స్టైల్ ని అనుసరించిందని చెబుతున్నారు. మొత్తానికి ఒక మంచి సోషల్ మెసేజ్ మూవీ అని చెబుతున్నారు.

ఐశ్వర్య ఒక సీరియస్ సబ్జెట్ ని తీసుకోని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సీన్ తరువాత సీన్ చాలా ఇంటెన్స్ గానే సాగుతుందట. కానీ ఎడిటింగ్ మూవీకి మైనస్ అయ్యిందని చెబుతున్నారు. రజిని అభిమానులకు కాకుండా సీరియస్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుందని చెబుతున్నారు. మొత్తానికి ఎబోవ్ యావరేజ్ చిత్రం అంటున్నారు.

Exit mobile version