Coolie
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ(Coolie)సినిమా రేపు ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర.. లాంటి స్టార్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగార్జున మొదటిసారి విలన్ గా చేస్తుండటంతో తెలుగు ఫ్యాన్స్ ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
కూలీ సినిమా కేవలం తెలుగులోనే 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కూలీ తెలుగులో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 50 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. అంటే దాదాపు 100 కోట్ల గ్రాస్ రావాలి. గతంలో జైలర్ సినిమా తెలుగులోనే 80 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు మూడు రోజులు హాలిడేస్, సినిమాలో నాగార్జున ఉన్నాడు కాబట్టి ఈజీగా తెలుగులో కూలీ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా కూలీ(Coolie)సినిమా 305 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 310 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. అంటే దాదాపు 620 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఈ సినిమాలో అన్ని పరిశ్రమల స్టార్స్ ఉండటం, ఆల్రెడీ అడ్వాన్స్ సేల్స్ లోనే 75 కోట్లు కలెక్ట్ చేయడం, లోకేష్ కనగరాజ్ సినిమా కావడంతో ఈజీగా కలెక్షన్స్ వచ్చేస్తాయని అంచనా వేస్తున్నారు.
1000 కోట్ల టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగుతుంది కూలీ. గతంలో రజినీకాంత్ జైలర్ సినిమా 600 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఇప్పుడు కూలీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి.
Also Read : NTR : వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చేది అప్పుడే.. వార్ 2లో ఎన్టీఆర్ గురించి బాలీవుడ్ టాక్ ఇదే..