Lal Salaam : రజినీకాంత్ నెక్స్ట్ సినిమా ‘లాల్ సలామ్’ టీజర్ చూశారా.. హిందూ ముస్లిం గొడవలతో..

ఐశ్వర్య ర‌జినీకాంత్ (Aishwarya Rajinikanth) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ‘లాల్ స‌లామ్‌’. విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ (Vikranth) లు హీరోలుగా న‌టిస్తున్నారు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు.

Rajinikanth Next Movie Lal Salaam Teaser Released

Lal Salaam Teaser : త‌లైవా రజినీకాంత్ (Rajinikanth) ఇటీవల జైలర్ సినిమాతో భారీ సక్సెస్ సాధించారు. ఇప్పుడు ‘లాల్ స‌లామ్‌’ అనే సినిమాతో రాబోతున్నారు. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ర‌జినీకాంత్ (Aishwarya Rajinikanth) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ‘లాల్ స‌లామ్‌’. విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ (Vikranth) లు హీరోలుగా న‌టిస్తున్నారు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమాలో రజినీకాంత్ ముస్లిం నాయకుడు ‘మొయ్దీన్ భాయ్‌’గా క‌నిపించ‌నున్నాడు. న‌టి జీవిత రాజశేఖర్ కూడా ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read : Tollywood Diwali : సింగిల్ ఫ్రేమ్‌లో మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇది కదా దీపావళి స్పెషల్ ట్రీట్..

తాజాగా ‘లాల్ సలామ్’ నుంచి టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ చూస్తుంటే.. సినిమా హిందు, ముస్లిం గొడవల మధ్య తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఒక ఊళ్ళో జరిగే హిందూ ముస్లిం గొడవలు, ఓ ముస్లిం నాయకుడిగా రజినీకాంత్ ఈ గొడవలపై ఎలా స్పందించాడు అనేది కథగా ఉండబోతుంది. ప్రస్తుతం ‘లాల్ సలామ్’ టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.