South Stars : 600 కోట్లు క్లబ్‌లోకి అడుగుపెట్టిన సౌత్ స్టార్స్ వీరే.. ఏ హీరోకి ఎన్ని సినిమాలు..?

ఇప్పటి వరకు 600 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన స్టార్స్ ఎవరో తెలుసా..? ఒక్కో హీరోకి ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా..?

Rajinikanth Prabhas Ram Charan NTR Yash had 600 crore movies

South Stars : ప్రస్తుతం సౌత్ సినిమాల మార్కెట్ ఓ రేంజ్ లో ఉంది. దక్షిణాది చిత్రాల ఓపెనింగ్సే కోట్లతో మొదలవుతున్నాయి. కేవలం మూడు రోజుల మొదటి వీకెండ్ లోనే 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంటున్నాయి. సూపర్ స్టార్ లేదా స్టార్ డైరెక్టర్ అని కాకుండా.. సినిమా కథ నచ్చితే ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టి కాసుల వర్షం కురిపిస్తున్నారు. అలాగే లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలు ఆదరిస్తుండడం కూడా మరో బెన్ఫిట్. దీంతో చిన్న సినిమాలకు కూడా 100 కోట్ల కలెక్షన్స్ అందుతున్నాయి.

Sankranti 2024 : ఈసారి పండక్కి సినిమాల జాతర మాములుగా లేదుగా..

కాగా రజినీకాంత్ (Rajinikanth) నటించిన జైలర్ (Jailer) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తాజాగా 600 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంతో రజిని స్టామినా ఏంటో ఆడియన్స్ కి మరోసారి తెలిసింది. కాగా ఇప్పటి వరకు 600 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన స్టార్స్ ఎవరో తెలుసా..? రజినికి ఇది రెండో సినిమా. అంతకుముందు ‘2.0’ చిత్రంతో 700 పైగా కలెక్షన్స్ ని రాబట్టాడు. దీంతో రజిని అకౌంట్ లో రెండు 600 కోట్ల మార్క్ సినిమాలు ఉన్నాయి.

Rocking Rakesh : హీరోగా రాకింగ్ రాకేష్‌.. ఎంపీ సంతోష్ కుమార్ క్లాప్‌తో ప్రారంభమైన సినిమా

ఇక రజిని తరువాత.. ప్రభాస్ (Prabhas) బాహుబలి సినిమాలతో ఆ మార్క్ ని క్రాస్ చేశాడు. బాహుబలి పార్ట్-1 650 కోట్ల పైగా కాలేచ్ట్ చేయగా, సెకండ్ పార్ట్ ఇండియా వైడ్ రూ.1,416.9 కోట్లు, వరల్డ్ వైడ్ రూ.1788.06 కోట్లు అందుకున్నాడు. ఇక రీసెంట్ RRR రూ.1230 కోట్లు అందుకొని రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) ని ఒకేసారి 600 కోట్ల క్లబ్ లోకి తీసుకొచ్చింది. ఈ చిత్రం తరువాత యశ్ (Yash) కేజీఎఫ్-2 సినిమాతో రూ.1215 కోట్ల వరకు అందుకుంది. ప్రస్తుతానికి ఈ హీరోలు 600 కోట్ల క్లబ్ లో నిలిచారు.

మొత్తం మీద 600 కోట్ల క్లబ్ లో రజిని అండ్ ప్రభాస్ కి రెండు సినిమాలు ఉంటే.. రామ్ చరణ్, ఎన్టీఆర్, యశ్ లకు ఒక్కో సినిమా ఉంది. అదే డైరెక్టర్స్ వెర్షన్ లో చెప్పాలంటే.. రాజమౌళికి మొత్తం మూడు చిత్రాలు ఉండగా.. శంకర్, ప్రశాంత్ నీల్, నెల్సన్ దిలీప్ కుమార్ కి ఒక్కో సినిమా ఉంది.

 

ట్రెండింగ్ వార్తలు