Rajinikanth: విజయ్ దర్శకుడితో సూపర్ స్టార్ కథా చర్చలు.. ఫైనల్ అయ్యేనా?
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు సక్సెస్ కోసం వేట ప్రారంభించారు. కెరీర్ లో ఎన్నో సక్సెస్ మైలురాళ్లును చూసిన ఆయనకు ఈ మధ్య కాలం సరైన కథ దొరకడం లేదు. ఎప్పటికప్పుడు బ్యాక్ టూ రజనీ..
- Naresh Mannam
- Published On : February 8, 2022 / 02:47 PM IST
Rajinikanth
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు సక్సెస్ కోసం వేట ప్రారంభించారు. కెరీర్ లో ఎన్నో సక్సెస్ మైలురాళ్లును చూసిన ఆయనకు ఈ మధ్య కాలం సరైన కథ దొరకడం లేదు. ఎప్పటికప్పుడు బ్యాక్ టూ రజనీ అనే హోప్ తో సినిమాలు వస్తున్నా తీరా థియేటర్లలోకి వచ్చేసరికి ఉసూరుమనిపిస్తున్నాయి. తమిళనాట ఆయనకున్న క్రేజ్ తో కాస్త పర్వాలేదనిపించినా మిగతా బాషలలో రజినీ సినిమాలకు ఆదరణ తగ్గిపోతుంది.
Youtuber Sarayu: క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమైన సరయూ..
ఈ మధ్యనే ఎన్నో ఆశలతో సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన అన్నాత్తై కూడా భారీ ప్లాప్ మూటగట్టుకుంది. రోబో లాంటి సినిమాతో ఇండియన్ సినిమాను తనవైపుకు తిప్పుకున్న ఆయనకు ఇప్పుడు తన రేంజ్ సినిమాలిచ్చే దర్శకులు దొరకడం లేదేమో అనిపిస్తుంది. ఆయన స్థాయికి తగిన కథలను కాకుండా వాళ్ళకి నచ్చిన కథలలో ఆయన ఇరికించేస్తున్నారా అనిపిస్తుంది. మొత్తంగా రజనీకి ఇప్పుడు భారీ సక్సెస్ కావాలి. రజని తర్వాత సినిమా కోసం ఈ మధ్య కాలంలో చాలామంది పేర్లు వినిపించాయి.
Lata Mangeshkar : లతా మంగేష్కర్ పై స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల.. త్వరలో..
అయితే, రజనీ ఇప్పుడు మరో స్టార్ హీరో విజయ్ దళపతితో పనిచేసిన దర్శకుడితో కథా చర్చలు నడిపిస్తున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో కథనాలు వస్తున్నాయి. విజయ్ తో బీస్ట్ సినిమా చేస్తున్న నెల్సన్ రజిని కోసం ఓ సాలిడ్ కథ సిద్ధం చేస్తుండగా ఇప్పటికే దీనికి సంబంధించి కథా చర్చలు కూడా పూర్తయ్యాయని చెప్తున్నారు. రజనీ ఫ్యాన్స్ కు ఇది ఎగ్జైటింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. కానీ.. అనుకున్నట్లే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
