Site icon 10TV Telugu

Rajinikanth : ‘బాబా’ సినిమా రిజల్ట్ రజినీకాంత్‌ని అంత బాధపెట్టిందా? ఏకంగా ఆ నిర్ణయం తీసుకొని..

Rajinikanth take a serious Decision after Baba Movie Failure

Rajinikanth take a serious Decision after Baba Movie Failure

Rajinikanth Baba Movie : సూపర్ స్టార్ రజినీకాంత్ 70 ఏళ్ళ వయసులో కూడా అభిమానుల కోసం ఇంకా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే జైలర్ సినిమాతో భారీ హిట్ కొట్టిన రజినీకాంత్ ప్రస్తుతం వేట్టయాన్‌ సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. అయితే తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన లాల్ సలామ్(Lal Salaam) సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేసారు రజినీకాంత్. ఈ సినిమా ఫిబ్రవరి 9న తమిళ్, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

తన కూతురి సినిమా కోసం రజినీకాంత్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా లాల్ సలామ్ సినిమా నుంచి జరిగిన ఓ ఈవెంట్ లో రజినీకాంత్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్ మాట్లాడుతూ.. ఐశ్వర్య ఈ కథ చెప్పినప్పుడు చాలామంది నిర్మాతలు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత నేను కొంతమంది నిర్మాతల పేర్లు చెప్పి వాళ్ళ దగ్గరకు వెళ్ళమన్నాను. కొంతమంది రజినీకాంతే ఎందుకు ఈ సినిమాని నిర్మించకూడదు అనుకోని ఉంటారు. అయితే నేను బాబా సినిమా తర్వాత అసలు ఏ సినిమాని నిర్మించకూడదు, నిర్మాతగా మారకూడదు అనుకున్నా. ఈ సినిమా కథ చెప్పేటప్పుడు అవార్డులు వస్తాయి అని నా కూతురు చెప్పింది. అవార్డులతో పాటు లాభాలు కూడా ముఖ్యం అని నేను చెప్పాను. ఒక సినిమా తీస్తే దానికి ప్రతిఫలం కూడా రావాలి అని తెలిపారు.

Also Read : Dr. Prathap C Reddy : తన తాతయ్య బయోపిక్ తీస్తానంటున్న ఉపాసన..

దీంతో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 2002లో వచ్చిన బాబా సినిమాని రజినీకాంత్ నిర్మించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా పనిచేసారు రజిని. అయితే ఈ సినిమా పరాజయం పాలైంది. అప్పట్లో ఈ సినిమా ఫెయిల్ అవ్వడంతో రజినీకాంత్ తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చారు. అంతేకాకుండా రజినీకాంత్ బాబా సినిమాని తనకి ఎంతో ఇష్టమైన ఆధ్యాత్మికత కథాంశంతో తీసినా ఫ్లాప్ అవ్వడంతో రజిని అప్పట్లోనే ఈ సినిమా ఫెయిల్ అయినందుకు బాధపడ్డానని తెలిపారు. గతంలో రజినీకాంత్ రెండు సినిమాలు నిర్మించారు. అయితే బాబా సినిమా ఫ్లాప్ అయి నష్టాలు రావడంతోనే రజినీకాంత్ ఇక లైఫ్ లో మళ్ళీ సినిమాలు నిర్మించకూడదు అని డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా బాబా సినిమా తమిళనాడులో అప్పట్లో పలు వివాదాల్లో నిలిచింది. రజినీపై కేసులు కూడా పెట్టారు. అందుకే ఇప్పుడు తన కూతురు అడిగినా కూడా నిర్మించకుండా వేరే నిర్మాతల పేర్లు సజెస్ట్ చేసారు రజిని. అయితే ఇదే బాబా సినిమాని ఇటీవల 2022లో రీ రిలీజ్ చేసారు.

Exit mobile version