Rajinikanth – Amitabh bachchan : ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహాం జూలై 13న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌గా ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. కన్వెక్షన్ సెంటర్ మొత్తం కోలాహలంతో నిండిపోయింది. ఈ వివాహ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్.. తన భార్య, కుమార్తెతో కలిసి హాజరయ్యారు. పెళ్లి వేడుకకు ముందు జరిగిన బరాత్ కార్యక్రమంలో తలైవా డాన్స్ తో అదరగొట్టాడు.
ఇదిలా ఉంటే.. ఈ పెళ్లి వేడుకలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజినీకాంత్‌లు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆనంత్ పెళ్లివేడుకల్లో అమితాబ్ బచ్చన్‌ను చూడగానే రజినీకాంత్ వెంటనే ఆయన వద్దకు వెళ్లి బిగ్‌బీ పాదాలను తాకే ప్రయత్నం చేశారు. వెంటనే అమితాబ్.. రజినీని వారించారు. అనంతరం ఇద్దరూ కరచాలనం చేసుకుని కౌగిలించుకున్నారు. అనంతరం ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.
Movie Artists Association : యూట్యూబ్ ఛానల్స్‌పై’మా’ అసోసియేషన్ కొరడా.. 5 ఛానల్స్ తొలగింపు..
కాగా.. వీళ్లిద్దరూ 33 ఏళ్ల క్రితం ఓ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి ఓ మూవీలో కనిపించనున్నారు. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘వెట్టయన్’ మూవీలో బిగ్‌బీ ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
G.O.A.T. Level Moment #AmitabhBachchan #Rajinikanth pic.twitter.com/cvmygU9mlO
— BollyHungama (@Bollyhungama) July 13, 2024