Site icon 10TV Telugu

Vettaiyan Trailer : ‘వేట్టయన్’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

Rajinikanth Vettaiyan Trailer out now

Rajinikanth Vettaiyan Trailer out now

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ న‌టిస్తున్న మూవీ వేట్టయన్. టి.జె. జ్ఞానవేల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌,రానా, మంజు వారియర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ పతాకం పై సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ అక్టోబ‌ర్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

అందులో భాగంగా తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. ఓ మ‌హిళ‌ను అత్యాచారం చేసి దారుణంగా హ‌త‌మార్చిన నేర‌స్తుడిని ఖైదు చేయాలంటూ ప్ర‌జ‌లంతా పోరాడ‌డంతో ట్రైల‌ర్ ఆరంభ‌మైంది. నేర‌స్తుడిని ప‌ట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగుతారు. హంత‌కుడు ఎవ‌రు అనేది తెలుసుకునేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అప్పుడే ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్టుగా ర‌జినీకాంత్ ఎంట్రీ ఇస్తారు. వారం రోజులు అక్క‌ర‌లేదు మూడు రోజుల్లో డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు వ‌స్తుంద‌ని మాట ఇస్తారు.

Nagarjuna : కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై నాగార్జున రియాక్ష‌న్‌.. మా కుటుంబం పట్ల..

మొత్తంగా ట్రైల‌ర్ అదిరిపోయింది.’ క్రైమ్ క్యాన్సర్ లాంటిది దానిని పెరగనివ్వకూడదు”, అన్యాయం జరుగుతున్నప్పుడు పోలీసులు మౌనంగా ఉండడం కంటే న్యాయాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పు కాదు.’ అనే డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

Exit mobile version