దెబ్బ అదుర్సు కదూ.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో కుమ్మిపడేస్తున్న రజనీకాంత్ ‘కూలీ’.. ఏకంగా అన్ని కోట్లా? ‘వార్ 2’తో బిగ్ ఫైట్.. ఏం జరుగుతోంది?

ఈ సినిమాలో కేవలం రజనీకాంత్ మాత్రమే కాకుండా నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ వంటి  ప్రముఖ నటులు నటించారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ద సినిమాలు వచ్చేస్తున్నాయ్. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’, హృతిక్ రోషన్, జూనియర్‌ ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నాయి. ఈ భారీ పోటీకి ముందు ‘కూలీ’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమై సంచలనం సృష్టిస్తున్నాయి.

కేరళ, కర్ణాటకలోని కొన్ని థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ రాష్ట్రాల్లో ఆగస్టు 14న ఉదయం 6 గంటలకే మొదటి షో ఉంది.

తమిళనాడులో 2023లో ‘తునివు’ సినిమా విడుదల సమయంలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన కారణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తెల్లవారుజాము ప్రదర్శనలను రద్దు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొదటి షో ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది.

సెన్సార్ బోర్డు కూలీ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఫలితంగా, తమిళనాడులోని చాలా థియేటర్లు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిని అనుమతించబోమని స్పష్టమైన ప్రకటనలు చేశాయి.

ప్రపంచవ్యాప్తంగా ‘కూలీ’ హవా

‘కూలీ’ సినిమాపై అంచనాలు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి UK సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ మొదటి షో భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు (స్థానిక కాలమానం 12.30 AM) ప్రదర్శిస్తారు.

దుబాయ్‌లో ఉదయం 9:30 గంటలకు షోలు ప్రారంభం కానున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని షోలు జోడించే అవకాశం ఉంది.

ప్రీ-సేల్స్‌లో రికార్డుల మోత

ట్రేడ్ రిపోర్టుల ప్రకారం.. ‘కూలీ’ సినిమా ఇప్పటికే ప్రీ-సేల్స్ ద్వారా $2 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఇందులో అత్యధికంగా $1.3 మిలియన్లు కేవలం ఉత్తర అమెరికా నుంచే రావడం విశేషం. అక్కడి డిస్ట్రిబ్యూటర్ల సమాచారం ప్రకారం.. ఇప్పటికే 50,000 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్యలను బట్టి చూస్తే.. ‘కూలీ’ ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్‌ను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

భారీ తారాగణం – భారీ అంచనాలు

ఈ సినిమాలో కేవలం రజనీకాంత్ మాత్రమే కాకుండా నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ వంటి  ప్రముఖ నటులు నటించారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ‘కూలీ’ చిత్రం కోలీవుడ్ చరిత్రలో తొలి రూ.1000 కోట్ల సినిమాగా నిలుస్తుందా? సమాధానం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.