Munna Bhai 3 : మున్నాభాయ్ మళ్ళీ వస్తున్నాడా? మున్నాభాయ్ 3 ప్లాన్ చేస్తున్నారా?

మున్నాభాయ్ కి మరో సీక్వెల్ తెరకెక్కుతోందని సమాచారం వస్తుంది. తాజాగా బాలీవుడ్ లో డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణిని సంజయ్ దత్ కలవగా అదే సమయంలో సర్క్యూట్ వేషంలో అర్షద్ కూడా వచ్చాడు.

Rajkumar Hirani Sanjay Dutt Munna Bhai another Sequel news goes viral with recent Meeting

Munna Bhai 3 :  బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి(Rajkumar Hirani) దర్శకత్వంలో సంజయ్ దత్(Sanjay Dutt) హీరోగా 2003లో వచ్చిన మున్నాభాయ్ MBBS సినిమా భారీ విజయం సాధించింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా మున్నాభాయ్ సినిమా ప్రేక్షకులని మెప్పించింది. మున్నాభాయ్ MBBS సినిమాకు సీక్వెల్ గా లగేరహో మున్నాభాయ్ సినిమా తీయగా ఇది కూడా హిట్ అయింది. ఇదే సినిమాలని తర్వాత తెలుగులో శంకర్ దాదా MBBS, శంకర్ దాదా జిందాబాద్ గా చిరంజీవి రీమేక్ చేసి హిట్స్ కొట్టారు. తమిళ్ లో కూడా ఈ సినిమాలు రీమేక్ అయ్యాయి.

మున్నాభాయ్ లో సంజయ్ దత్ పక్కన ఉండే సర్క్యూట్ క్యారెక్టర్ లో అర్షద్ వార్సీ నటించాడు. అయితే ఇప్పుడు మున్నాభాయ్ కి మరో సీక్వెల్ తెరకెక్కుతోందని సమాచారం వస్తుంది. తాజాగా బాలీవుడ్ లో డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణిని సంజయ్ దత్ కలవగా అదే సమయంలో సర్క్యూట్ వేషంలో అర్షద్ కూడా వచ్చాడు. ఈ ముగ్గురి కలయిక ఇప్పుడు బాలీవుడ్ లో వైరల్ గా మారింది.

Shahrukh – Deepika : స్టేజిపై దీపికా – షారుఖ్ అదిరిపోయే డ్యాన్స్.. జవాన్ సాంగ్ కి స్టెప్పులు..

రాజ్ కుమార్ హిరాణి ప్రస్తుతం షారుఖ్ డుంకి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో సంజయ్ దత్ ఉన్నట్టు, అందుకే సంజయ్ ని కలిసాడని సమాచారం. కానీ అర్షద్ సర్క్యూట్ వేషంలో రావడంతో మున్నాభాయ్ సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నారేమో అని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఈ ముగ్గురు కూడా స్పందించలేదు. అభిమానులు, ప్రేక్షకులు మాత్రం మున్నాభాయ్ 3 వచ్చి మరోసారి నవ్విస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అయితే కొంతమంది ఏమో మున్నాభాయ్, సర్క్యూట్ క్యారెక్టర్స్ డుంకిలో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాయి అని అంటున్నారు.