Rakesh Master : నేను అస్తమించే సూర్యుడిని.. రాకేశ్ మాస్టర్ తన మరణం గురించి ముందే చెప్పారు.. వీడియో వైరల్!
టాలీవుడ్ కొరియోగ్రఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూశారు. అయితే ఆయన మరణం గురించి ముందే ప్రేక్షకులకు చెప్పారని ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
- gum 95921
- Published On : June 18, 2023 / 08:15 PM IST
Rakesh Master passed away and his old videos gone viral
Rakesh Master : టాలీవుడ్ కొరియోగ్రఫర్ రాకేశ్ మాస్టర్ మరణవార్త అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. కొన్ని రోజులు క్రిందట వరకు యూట్యూబ్ వీడియోస్ తో ప్రేక్షకులకు కనిపిస్తూ వచ్చిన ఆయన.. ఈరోజు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈరోజు (జూన్ 18) ఉదయం రక్త విరోచనాలు అవ్వడంతో కుటుంబసభ్యులు ఆయనని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇక అక్కడ ట్రీట్మెంట్ అందుకుంటూ సాయంత్ర 5 గంటల సమయంలో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో మృతి చెందారు.
Rakesh Master : రాకేష్ మాస్టర్ మృతి.. ప్రభాస్‌కి డాన్స్ నేర్పిస్తున్న ఫోటో వైరల్..
కాగా రాకేష్ మాస్టర్ తన మరణం గురించి ముందే చెప్పారంటూ ఒక వీడియోని నెటిజెన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.. “నా శరీరంలో మార్పులు వస్తున్నాయని నాకు తెలుసు. నేను అస్తమించే సూర్యుడిని” అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ వైరల్ వీడియోని చూసిన కొందరు అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఇక రాకేష్ మాస్టర్ కెరీర్ విషయానికి వస్తే.. రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్ రామారావు. ఆట, ఢీ వంటి డ్యాన్స్ షోలతో కెరీర్ ని స్టార్ట్ చేశారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, చిరునవ్వుతో వంటి సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు.
దాదాపు 1500 చిత్రాలకు పైగా కోరియోగ్రఫీ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి కెరీర్ స్టార్టింగ్ డాన్స్ డాన్స్ పాఠాలు కూడా చెప్పారు. అందుకు సంబంధించిన ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రఫర్‌లుగా సాగుతున్న జానీ మాస్టర్ (Jani Master), శేఖర్ మాస్టర్ (Sekhar) ఈయన దగ్గర శిష్యులుగా చేశారు.
