Rakesh Master : రాకేశ్‌ మాస్టర్‌ మృతి.. ప్రభాస్‌కి డాన్స్ నేర్పిస్తున్న ఫోటో వైరల్..

ప్రముఖ డాన్స్ మాస్టర్ రాకేష్ నేడు మృతి చెందారు. ఇక ఆయనకు సంతాపం తెలియజేస్తూ అభిమానులు ప్రభాస్ తో ఉన్న ఫోటోని వైరల్ చేస్తున్నారు.

Rakesh Master : రాకేశ్‌ మాస్టర్‌ మృతి.. ప్రభాస్‌కి డాన్స్ నేర్పిస్తున్న ఫోటో వైరల్..

Rakesh Master passed away and prabhas pic viral in social media

Updated On : June 18, 2023 / 8:44 PM IST

Rakesh Master : టాలీవుడ్ కొరియోగ్రఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ ఈరోజు (జూన్ 18) కన్నుమూశారు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు అవ్వడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు కుటుంబసభ్యులు. ఇక అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ కి సంబంధించిన ఒక పాత ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

Rakesh Master : రెండు నెలలు క్రిందటే డాక్టర్లు ఆయన బతకడం కష్టమని చెప్పేశారు.. రాకేశ్‌ మాస్టర్‌ అసిస్టెంట్‌ కామెంట్స్!

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎంతో గొప్ప స్టార్‌డమ్ ని అందుకున్న ప్రభాస్ (Prabhas) కి కెరీర్ మొదటిలో రాకేష్ మాస్టర్ డాన్స్ పాఠాలు నేర్పించాడు. అలా డాన్స్ నేర్పిస్తున్న ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఫోటోని షేర్ చేస్తూ అభిమానులు ఆయనని గుర్తు చేసుకుంటున్నారు. కాగా రాకేష్ మాస్టర్.. ఆట, ఢీ వంటి డ్యాన్స్‌ షోలతో కెరీర్ ని స్టార్ట్ చేశారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, చిరునవ్వుతో వంటి సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. కెరీర్ మొత్తంలో దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రఫర్‌గా పని చేశారు.

SPY Movie : సుభాష్ చంద్రబోస్ మిస్టరీ సీక్రెట్ రివీల్‌కి డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ పై క్లారిటీ!

రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్‌ రామారావు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రఫర్‌లుగా సాగుతున్న జానీ మాస్టర్ (Jani Master), శేఖర్ మాస్టర్ (Sekhar) ఈయన దగ్గర శిష్యులుగా చేశారు. కాగా రాకేష్ మాస్టర్ చనిపోతారని రెండు నెలలు క్రిందటే డాక్టర్లు తెలియజేసినట్లు ఆయన అసిస్టెంట్‌ సాజిత్‌ మీడియాకి చెప్పుకొచ్చాడు. హనుమాన్ మూవీ క్లైమాక్స్ షూటింగ్ సమయంలో మాస్టర్‌కు వాంతులు, విరోచనాలు అయ్యాయని, అప్పుడు హాస్పిటల్ కి తీసుకు వెళ్లగా.. డాక్టర్లు ఆయన బతకడం కష్టమని, జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరించారట.