×
Ad

Rakesh Master : ప్రభుదేవాతో రాకేశ్‌ మాస్టర్‌ గొడవ ఏంటో తెలుసా..? పబ్లిక్‌గా సవాల్ విసిరి!

రాకేష్ మాస్టర్ కెరీర్ స్టార్టింగ్ లో ఇండియన్ మైకల్ జాక్సన్ ప్రభుదేవాకే పబ్లిక్‌గా సవాల్ విసిరి అప్పటిలో సంచలనం సృష్టించారు. ఆ విషయం ఏంటో తెలుసా?

  • Published On : June 18, 2023 / 08:42 PM IST

Rakesh Master public challenge to Prabhu Deva in career starting days

Rakesh Master : టాలీవుడ్ కొరియోగ్రఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ ఈరోజు (జూన్ 18) సాయంత్రం కన్నుమూశారు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు అవ్వడంతో కుటుంబసభ్యులు ఆయనని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్ర 5 గంటల సమయంలో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. కాగా ఇండియన్ మైకల్ జాక్సన్ ప్రభుదేవాకే (Prabhu Deva) పబ్లిక్‌గా సవాల్ విసిరి అప్పటిలో సంచలనం సృష్టించారు.

Rakesh Master : నేను అస్తమించే సూర్యుడిని.. రాకేష్ మాస్టర్ తన మరణం గురించి ముందే చెప్పారు.. వీడియో వైరల్!

ఆట, ఢీ వంటి డ్యాన్స్‌ షోలతో కెరీర్ ని స్టార్ట్ చేసిన రాకేష్ మాస్టర్.. ఢీలో కొనసాగుతున్న సమయంలో ప్రభుదేవా పై సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు డ్యాన్సర్లకు అన్యాయం జరుగుతుందని, తెలుగు తెలిసిన వారే ఇక్కడ డాన్స్ షోలకు జడ్జిలుగా వ్యవహరించాలని, తెలుగు వారే ఇక్కడి షోలో పాల్గొని మన దమ్ము ఏంటో ప్రపంచానికి తెలియజేయాలని గొంతు ఎత్తి మాట్లాడారు. ఆ సమయంలో ప్రభుదేవా స్టార్ హీరోగా, కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్నాడు. దీంతో రాకేష్ మాస్టర్ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.

Rakesh Master : రాకేష్ మాస్టర్ మృతి.. ప్రభాస్‌కి డాన్స్ నేర్పిస్తున్న ఫోటో వైరల్..

అక్కడి నుంచే రాకేష్ మాస్టర్ లైఫ్ టర్న్ అయ్యింది. ఆయన పేరు ఇండస్ట్రీ అంతా వినిపించింది. ఆ తరువాత ఆయన కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేయడం, పలువురు స్టార్ హీరోలకు, సూపర్ హిట్ సినిమాలకు కోరియోగ్రఫీ చేసి మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. దాదాపు 1500 చిత్రాలకు పైగా కోరియోగ్రఫీ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసినవారే. వారిలో జానీ మాస్టర్ (Jani Master), శేఖర్ మాస్టర్ (Sekhar) కూడా ఉన్నారు.