Rakesh Varre : మొత్తానికి ‘జితేందర్ రెడ్డి’ హీరో ఎవరో తెలిసిపోయింది..

కొద్దిరోజుల క్రితం జితేందర్ రెడ్డి(Jithendar Reddy) అనే పేరుతో హీరో ఎవరో తెలియకుండా పోస్టర్లు రిలీజ్ చేశారు. పోస్టర్లు చూడడానికి చాలా పవర్ఫుల్ గా ఉన్నప్పటికి అందులో ఉన్న కథానాయకుడు ఎవరు?, అసలు టైటిల్ లో ఉన్న ఈ జితేందర్ రెడ్డి ఎవరు? అని చర్చనీయాంశం అయ్యింది.

Rakesh Varre Playing Main Lead in Jithendar Reddy Movie under Virinchi Varma Direction

Rakesh Varre : కొద్దిరోజుల క్రితం జితేందర్ రెడ్డి(Jithendar Reddy) అనే పేరుతో హీరో ఎవరో తెలియకుండా పోస్టర్లు రిలీజ్ చేశారు. పోస్టర్లు చూడడానికి చాలా పవర్ఫుల్ గా ఉన్నప్పటికి అందులో ఉన్న కథానాయకుడు ఎవరు?, అసలు టైటిల్ లో ఉన్న ఈ జితేందర్ రెడ్డి ఎవరు? అని చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల ఒక వ్యక్తి కొంత మంది జనాల ముందు కూర్చుని చిన్న పాప మీద చెయ్యి వేసి నాయకుడు శైలిలో కనిపిస్తాడు. కాని ఆ పోస్టర్ లో కూడా హీరో ఎవరు అనేది తెలియడం లేదు. ఆ పోస్టర్ తో అసలు ఆ పాత్ర చెయ్యబోతున్న హీరో ఎవరు?, ఎందుకు అతన్ని దాచారు అని రకరకాల కథనాలు ఇండస్ట్రీలో వినిపించాయి.

ఇప్పుడు ఆ సస్పెన్స్ ని రివీల్ చేస్తూ ఇంకో పోస్టర్ ని విడుదల చేశారు. జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే గన్ పట్టుకుని ఎంతో డైనమిక్ గా నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది ఆ పోజ్. చూడడానికి ఒక యంగ్ పోలీస్ లాగా ఉన్నాడు. కాకపోతే ముందు రిలీజ్ చేసిన పోస్టర్స్ లో లీడర్ లుక్స్ ఉన్నాయి. హీరోగా ఒక సినిమా చేసి హిట్ అందుకున్న తరువాత కూడా ఇంత గ్యాప్ తీసుకుని ఈ జితేందర్ రెడ్డి సినిమానే రాకేష్ ఎందుకు ఎంచుకున్నారు?

Also Read : Theatrical Releases : ఈ వారం తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే.. ఏకంగా అరడజను పైగా..

అసలు ఈ కథలో మరియు ఆ పాత్రలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అనేది జితేందర్ రెడ్డి సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ వచ్చే వరుకు వేచి చూడాల్సిందే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ జితేందర్ రెడ్డి క్యారెక్టర్ కి సరైన నటుడు కోసం దర్శకుడు విరించి వర్మ దాదాపు 6 నెలల పాటు అనేక మందిని రిజెక్ట్ చేసి చివరికి రాకేష్ వర్రే మాత్రమే ఈ పాత్రకి సరిపోతారని నమ్మి తీసుకున్నారని సమాచారం. రాకేష్ ఈ క్యారక్టర్ కి ఎంత న్యాయం చేశారనేది సినిమాలో చూడాలి. సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో రానున్నాయి.