రకుల్ ప్రీత్ జిమ్ బాగా మిస్ అవుతోందట..

లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తప్పదు కాబట్టి పనులకోసం సామాన్యులు కొందరు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. సెలబ్రిటీలు మాత్రం ఇంకొద్ది రోజులైనా పర్లేదు ఇంట్లోనే ఉందాం అనుకుని, ఇప్పటి వరకు టైం దొరక్క చేయలేని పనులు చేస్తున్నారు. నచ్చిన విషయాలు నేర్చుకుంటున్నారు. కొత్త సినిమాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు తమ యాక్టివిటీస్ అన్నిటినీ పిక్స్, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. Throwback పేరుతో పాత పిక్స్ షేర్ చేసి మెమరీస్ గుర్తు చేసుకుంటున్నారు.
ఇక రీసెంట్‌గా హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ షేర్ చేసిన వర్కౌట్ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. బ్లాక్ స్పోర్ట్స్ బ్రా, షార్ట్ ధరించి నెటిజన్లలో హీట్ పెంచుతుంది. ఆ ఫోటోకు ‘‘Waiting to hit the gym ?? till then throwback to feeling the fittest #mondaymotivation’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. జిమ్ విషయానికొస్తే F45 Training Fitness Gym ఫ్రాంచైజీలో రకుల్ స్వయంగా కొన్ని జిమ్స్ రన్ చేస్తున్న సంగతి తెలిసిందే.