సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసుతో బయటకు వచ్చిన డ్రగ్స్ కేసుతో బాలీవుడ్ వణికిపోతుంది. నటి దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, సిమోన్ ఖంబాటాతో సహా ఏడుగురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) పిలిపించింది. ప్రతి ఒక్కరూ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఎన్‌సిబి కార్యాలయానికి వస్తున్నారు. డ్రగ్స్ కేసులో నటి దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, సిమోన్ ఖంబాటాతో సహా ఏడుగురిని ప్రశ్నించనున్నారు అధికారులు.
డ్రగ్స్ కేసులో అరెస్టైన రియా చక్రవర్తి, రకుల్ ప్రీత్ సింగ్ మంచి స్నేహితులు. వారిద్దరూ ముంబైలో ఒకే జిమ్‌లో వర్కవుట్స్ చేస్తారు. కామన్ ఫ్రెండ్స్ పార్టీల్లో కలిసి పాల్గొన్న దాఖలాలు ఉన్నాయి. అయితే రియా చక్రవర్తికి టాలెంట్ మేనేజర్ జయ సాహా మధ్య జరిగిన వాట్సాప్ ఛాటింగ్ లీక్ కావడంతో రకుల్ ప్రీత్‌కు ఉన్న సంబంధాలు బయటకొచ్చాయి. రకుల్ ప్రీత్ సింగ్, సిమోన్ ఖంబాటా ఎన్‌సిబి ముందు హాజరు కావలసి ఉంది. అయితే విచారణ సమయంలో రియా చక్రవర్తి 25 పేర్లను లేవనెత్తారు, ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉంది. దీనికి వ్యతిరేకంగా రకుల్ హైకోర్టులో పిటీషన్ వేశారు.
అయితే రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు, సిమోన్ ఖంబాట్టాను కూడా ఈ రోజు(24 సెప్టెంబర్ 2020) ఎన్‌సిబి ప్రశ్నించబోతోంది. ఈ నటీమణుల వాంగ్మూలాలు రాబోయే మూడు రోజుల్లో రికార్డ్ చేయబడతాయి. ఈ కేసులో స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడానికి డిజైనర్ సిమోన్ ఉదయం 10 గంటలకు ఎన్‌సిబి కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, రకుల్ ప్రీత్ సింగ్‌కు నోటీసు రాలేదని ఆమె చెబుతున్నారు.
శ్రుతి మోడీ – సుశాంత్ మేనేజర్ శ్రుతి మోడీని కూడా ఈ రోజు ఎన్‌సిబి ప్రశ్నిస్తుంది. అంతకుముందు శ్రుతి మోడీని ముంబై పోలీసులు కూడా ప్రశ్నించారు.
దీపికా పదుకొనే – డ్రగ్స్ కేసులో అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు దీపికా పదుకొనే. ఆమె ప్రస్తుతం ముంబైలో లేదు, అటువంటి పరిస్థితిలో సెప్టెంబర్ 25న అంటే రేపు ఆమె ఎన్‌సిబి ముందు హాజరుకావచ్చు. అంతకు ముందు మంగళవారం, ఎన్‌సిబి నటి దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్, క్వాన్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ సీఈఓ ధ్రువ్ చిట్గోపేకర్‌లను కూడా విచారణకు పిలిచింది, కానీ ఆరోగ్యం సరిగా లేనందున ప్రకాష్ ఏజెన్సీ ముందు హాజరు కాలేదు.
సారా అలీ ఖాన్- సారా అలీ ఖాన్ సెప్టెంబర్ 26న ఎన్‌సిబి ముందు హాజరుకానున్నారు. ‘కేదార్‌నాథ్’ చిత్రంలో సుశాంత్‌తో సైఫ్, అమృత కుమార్తె సారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. నివేదిక ప్రకారం, సారా సుశాంత్‌తో కలిసి డ్రగ్స్ తీసుకునేదని చెబుతున్నారు.
శ్రద్ధా కపూర్- సెప్టెంబర్ 26 న నటి శ్రద్ధా కపూర్‌ను ఎన్‌సీబీ విచారించబోతోంది. ఇందుకోసం ఆమెకు సమన్లు కూడా పంపారు. శ్రద్ధా కపూర్ సుశాంత్‌తో కలిసి ‘చిచోర్’ అనే సినిమాలో పనిచేశారు.
కరిష్మా ప్రకాష్- దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్‌ను కూడా దర్యాప్తుకు పిలిచినప్పటికీ అనారోగ్యం కారణంగా ఆమె కొంత సమయం కోరింది. శుక్రవారం వరకు ఆమెకు మినహాయింపు ఇచ్చినట్లు అధికారి తెలిపారు. ఎన్‌సిబి సోర్స్ ప్రకారం, ప్రకాష్ వాట్సాప్ చాట్‌లో డ్రగ్స్ గురించి మాట్లాడినట్లుగా ఉంది.